Chaitanya Jonnalagadda: నేను చేసిన మూవీ ఒకటి రిలీజ్ కాలేదు..
Chaitanya Jonnalagadda (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chaitanya Jonnalagadda: నేను చేసిన మూవీ ఒకటి రిలీజ్ కాలేదు.. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నా!

Chaitanya Jonnalagadda: అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి, పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో దూసుకెళుతోంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు కురిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకుడు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొచ్చారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఈ సినిమాలో వెంకన్న (Venkanna) పాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటుడు చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda).. సినిమా విశేషాలను మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Akhanda 2: ‘ఓజీ’ రేంజ్‌లో కలెక్షన్స్ రాబడితేనే.. కొండంత బ్రేకీవెన్ టార్గెట్!

ఆ సినిమాల్లో నేను ఉన్నాననే విషయమే తెలియదు

‘‘ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ మేము ముందే ఊహించాం. మొదటి నుంచి ఈ మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకంతోనే ఉన్నాం. ఇందులో నేను చేసిన వెంకన్న పాత్రకు ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నాకు అకౌంట్ లేదు. ఇప్పుడు క్రియేట్ చేసుకోవాల్సివచ్చింది. నేను గతంలో ‘బబుల్ గమ్, హిట్ 3’ మూవీస్ చేశాను. ఆ సినిమాల్లో నేను ఉన్నాననే విషయం కూడా ఎవరికీ తెలియదు. వెంకన్న పాత్రతో మాత్రం అందరిలో గుర్తింపు తెచ్చుకున్నా. ఈ వెంకన్న పాత్ర కోసం మేకోవర్ పరంగా ప్రత్యేకంగా సిద్ధమయ్యాను. సెపరేట్‌గా కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేసుకున్నాం. గడ్డం పెంచి, నెత్తికి ఆయిల్‌తో చూడగానే భయపెట్టేలా ఆ పాత్రను తీర్చిదిద్దారు. ఈ విషయంలో దర్శకుడు, నేను డిస్కస్ చేసుకుని, నా మేకోవర్‌ని మార్చుకున్నాను.

Also Read- Actress Hema: నా కేసు కొట్టేశారు.. పోయిన నా పరువును తీసుకొచ్చిస్తారా?

వెంకన్న పాత్రకి నో చెప్పా..

పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో నేను లీడ్ రోల్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. అప్పుడు ఈ వెంకన్న పాత్ర నా దగ్గరకు వచ్చింది. ఈ పాత్ర కోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని తెలుసు. మరోవైపు నా సినిమాకు వర్క్ జరుగుతోంది. ఈ టైమ్‌లో నేను ఇలాంటి పాత్రను చేయగలనా అని చెప్పి.. ముందు నిర్మాత రాహుల్‌కు నో చెప్పాను. కానీ ఈటీవీ విన్ టీమ్, దర్శకుడు సాయిలు మీరే కావాలని అడుగుతున్నారని రాహుల్ పట్టుపట్టడంతో చేసేది లేక ఓకే చెప్పాను. నేను ఏ సినిమా చేసినా వెనక ఒక తెలిసిన ప్రొడక్షన్ లేదా వ్యక్తి ఉండాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే, గతంలో నేను చేసిన మూవీ ఒకటి రిలీజ్‌కు కూడా రాలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ సినిమాకు ఈటీవీ విన్, వంశీ నందిపాటి, బన్నీవాస్, వేణు ఊడుగుల.. ఇలా వీళ్లంతా ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఈ మూవీకి ఓకే చెప్పాను. ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రంతో పాటు దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’లో చేస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Panchayat Elections: మూడో విడుతపై దృష్టి సారించిన పార్టీలు.. రంగంలోకి ముఖ్య నాయకులు!

Bigg Boss Telugu 9: డిమాన్ పవన్ బిగ్ బాస్ కప్పు కోసమే ఇలా చేస్తున్నాడా?

Ramchander Rao: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కాంగ్రెస్‌కు ప్రేమ ఎందుకు? రాంచందర్ రావు తీవ్ర విమర్శ!

Viral Video: రూ.70 లక్షల బాణాసంచా.. గ్రాండ్ డెకరేషన్.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైరల్!

Aadi Srinivas Slams KTR: కేవలం 175 ఓట్ల తేడాతో 2009లో గెలిచావ్.. కేటీఆర్ కామెంట్స్‌కు ఆది స్ట్రాంగ్ కౌంటర్!