Andhra King Taluka: ఉపేంద్ర.. ఆసక్తికర విషయం చెప్పిన రామ్
Andhra King Taluka Event (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Andhra King Taluka: ఉపేంద్ర గురించి ఆసక్తికర విషయం చెప్పిన రామ్.. ఏంటంటే..

Andhra King Taluka: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి (Mahesh Babu P) దర్శకుడు. ‘మిస్టర్ బచ్చన్’ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర (Upendra) ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ అండ్ మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా పాటలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకుని చార్ట్‌బస్టర్‌లుగా నిలిచిన విషయం తెలిసిందే. అలాగే ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం వైజాగ్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

Also Read- Mass Jathara OTT: లైన్ క్లియర్.. ‘మాస్ జాతర’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

అభిమానానికి ఉన్న శక్తి అది..

ఈ కార్యక్రమంలో రామ్ పోతినేని మాట్లాడుతూ.. నా కెరీర్‌లో నేను గర్వపడే సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమా ఇంత అందంగా రావడానికి చాలా మంది కష్టపడ్డారు. మైత్రీ నిర్మాతలు చాలా ప్యాషన్ వున్న నిర్మాతలు. టిఓపి జార్జ్ సిద్ధార్థ ఫెంటాస్టిక్ విజువల్స్‌తో పాటు వివేక్ మార్విన్ తెలుగు సినిమాకి ఒక కొత్త సౌండ్‌ని పరిచయం చేశారు. ఈ ఆల్బమ్ గుండెల్లో నిలిచిపోతుంది. ఇది వారికి ఆరంభం మాత్రమే. తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్‌తో పాటు మంచి పర్ఫార్మ్ చేయగల హీరోయిన్ వచ్చింది. ఇటీవల వచ్చిన సినిమాలో భాగ్యశ్రీ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఏదైనా కొత్తగా చేయాలని అనుకుంటున్నప్పుడు దర్శకుడు మహేష్ నా జీవితంలోకి వచ్చాడు. తనతో వర్క్ చేయడం మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్‌గా భావిస్తున్నాను. మహేష్ వంటి హానెస్ట్ ఫిలిం మేకర్స్ తెలుగు సినిమాకి కావాలి. తను ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాతికేళ్ల క్రితం చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి, ఉపేంద్ర వంటి స్టార్ నటించిన సినిమా చూసి తన మనసు మార్చుకుని.. ధైర్యంగా నిలబడి ఒక కంపెనీ పెట్టాడు. ఆ తర్వాత వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఒక సినిమాకి, ఒక అభిమానానికి ఉన్న శక్తి. ఆయనతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్.. జీవితంలో పైకి రావాలంటే ప్యాషన్, పర్పస్ ఉండాలి. నా పర్పస్ మీరే. రెండూ ఇక్కడ టన్నులు టన్నులు ఉంది. నవంబర్ 27న వస్తున్నాం.. లెగుస్తున్నాం.. మళ్ళీ కొడుతున్నాం. అందరం థియేటర్స్‌లో కలుద్దామని అన్నారు.

Also Read- Akhanda 2: ‘ఓజీ’ రేంజ్‌లో కలెక్షన్స్ రాబడితేనే.. కొండంత బ్రేకీవెన్ టార్గెట్!

కాలర్ ఎగరేసుకుంటూ బయటికొస్తారు

రియల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ.. నేను నటించిన ‘ఏ, ఉపేంద్ర, రక్తకన్నీరు’ వంటి సినిమాలన్నీ మీకు గుర్తు ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన వ్యక్తిగా ఒక మాట చెప్తున్నాను. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేసుకుంటూ బయటికి వస్తారు. దర్శకుడు మహేష్ సినిమాని అద్భుతంగా మలిచాడు. ఎలివేషన్స్, కమర్షియల్, సాంగ్స్, లవ్వు అన్నీ ఉన్నాయి. రామ్, భాగ్యశ్రీ అద్భుతమైన కాంబినేషన్. రామ్ ఎనర్జీ ఈ సినిమాలో చూడండి. హీరోలందరి ఫ్యాన్స్ ఎనర్జీ అక్కడ ఉంది. నిర్మాతలకు థ్యాంక్స్. అభిమానుల అభిమానానికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని మీరందరూ థియేటర్స్ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Panchayat Election: ఉత్కంఠగా పంచాయతీ ఎన్నికలు.. ఒక్క ఓటుతో అభ్యర్థుల గెలుపు!

Gold Rates: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి