Mass Jathara OTT: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మాస్ జాతర’ (Mass Jathara) చిత్రం ఓటీటీ విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, థియేటర్లలో నిరాశపరిచినప్పటికీ, డిజిటల్ ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్రయూనిట్ ఆశపడుతోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన డిటైల్స్ వచ్చేశాయి. నవంబర్ 27వ తేదీ నుండి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం, విడుదలకు ముందు విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే, పలుమార్లు వాయిదా పడటం వల్ల సినిమాపై కొంత నెగెటివ్ ప్రభావం చూపింది. రిలీజ్ రోజున కూడా ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక, రవితేజ ఖాతాలో మరో ఫ్లాప్‌గా చేరింది. చిత్రానికి వచ్చిన టాక్‌తో ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఇష్టపడలేదు. ఓటీటీ విడుదల కోసం వేచి చూస్తున్నారు. (Mass Jathara OTT Release Details)
Also Read- Bigg Boss Telugu 9: ఫ్యామిలీ టైమ్ ఇంకా అయిపోలేదు.. తనూజకు గట్టిగా పడ్డాయ్
అన్ని అడ్డంకులను దాటుకుని..
నిర్మాణ సంస్థకు (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), ఓటీటీ సంస్థకు మధ్య నెలకొన్న కొన్ని విభేదాల కారణంగా, ‘మాస్ జాతర’ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీ విషయంలో గందరగోళం ఏర్పడింది. సుమారు నెల రోజుల పాటు ఈ వివాదం నడుస్తుండటంతో, అభిమానుల్లో కొంత అసహనం కనిపించింది. ఇదేంటి రవితేజ సినిమాకు ఇలా అవుతుందని అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఈ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని, ఎట్టకేలకు ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఇందులో లక్ష్మణ్ భేరి అనే రైల్వే పోలీస్‌గా నటించారు. గంజాయి స్మగ్లర్ శివుడు (నవీన్ చంద్ర), రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి మధ్య వైరం ఎలా మొదలైంది? శివుడి గంజాయి సామ్రాజ్యాన్ని లక్ష్మణ్ ఎలా నాశనం చేశాడనే కథాంశంతో భాను భోగవరపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేంద్రప్రసాద్, నరేష్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు.
Also Read- Ramanaidu Studios: జిహెచ్ఎమ్‌సీ నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ రియాక్షన్ ఇదే..
ఐదు భాషల్లో స్ట్రీమింగ్
రవితేజ మార్క్ యాక్షన్, కామెడీ మేళవింపుగా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటించింది. విలక్షణ నటుడు నవీన్ చంద్ర (Naveen Chandra) విలన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మాస్ జాతర’ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. రవితేజ యాక్షన్ డ్రామాను ఇంటిల్లిపాది హాయిగా చూసే అవకాశం దొరకడంతో, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్‌గా, మాస్ మహారాజా ‘మాస్ జాతర’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఎంతటి రచ్చ చేస్తుందో.. తెలియాలంటే మాత్రం నవంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

