Bigg Boss Telugu 9: తనూజకు గట్టిగా పడ్డాయ్.. నాగబాబు ఎంట్రీ
Bigg Boss King Episode (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: ఫ్యామిలీ టైమ్ ఇంకా అయిపోలేదు.. తనూజకు గట్టిగా పడ్డాయ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 76వ రోజైన (Bigg Boss Telugu Season 9 Day 76) శనివారం కింగ్ నాగార్జున (King Nagarjuna) తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌తో అటు హౌస్‌మేట్స్‌ను, ఇటు ఆడియెన్స్‌ను ఖుషి చేశారు. ముందుగా కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ గెలవడంతో.. ఇన్ని వారాల తర్వాత ఆమె కెప్టెన్ అయింది. అయితే గడిచిన వారమంతా కెప్టెన్‌గా ఉన్న తనూజ (Thanuja)కు మాత్రం గట్టిగానే అక్షింతలు పడ్డాయనేది తాజాగా వచ్చిన ప్రోమో తెలియజేస్తుంది. ఈ ప్రోమోలో కింగ్ నాగార్జున రావడమే.. తనూజ, దివ్యల మధ్య యుద్ధం అసలు తగ్గేటట్లే లేదు. జరుగుతానే ఉంది. అదేంటో చూద్దామంటూ.. భరణిని లేపి ‘తనూజ, దివ్యల గొడవలో తప్పు ఎవరిది?’ అని అడిగారు. భరణి (Bharani) తడుముకోకుండా తనూజది అని చెప్పేశాడు. సేమ్ క్వశ్చన్ ఇమ్ముని అడగగా దివ్యది తప్పనుకుంటున్నానని చెప్పాడు. పవన్ మాత్రం తనూజనే స్టార్ట్ చేసిందని చెప్పాడు. భరణి, ఇమ్ము, పవన్.. ఈ గొడవపై కొన్ని పాయింట్స్‌ని నాగ్‌కు చెబుతున్నారు. ఫైనల్‌గా తనూజకు నాగ్ క్లాస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ‘కెప్టెన్ అవ్వగానే కళ్లు నెత్తికెక్కాయా? పొగరు తలకెక్కిందా?’ అని నాగ్ చాలా సీరియస్‌గా తనూజను అడుగుతున్నారు. తనూజ తన వివరణ ఇస్తోంది. ‘మాట జారితే.. ఆట జారిపోతుంది. మీ ఇద్దరి గొడవలో మళ్లీ భరణిని ఎందుకు లాగారు? ఒక్క తప్పు చాలు.. పాతాళానికి వెళ్లిపోతావ్’ అంటూ నాగ్ తనూజకు హెచ్చరికలు చేస్తున్నారు.

Also Read- Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ నెక్ట్స్ ఫిల్మ్‌కు పవర్ ఫుల్ టైటిల్.. ప్రోమో అదిరింది

నా తమ్ముడు నాగబాబు.. భరణికి గురూజీ ఎలా?

ఫ్యామిలీ టైమ్ అంటూ వచ్చిన మరో ప్రోమోలో.. ఇప్పటి వరకు హౌస్‌లోకి వచ్చిన వారు కాకుండా.. హౌస్‌మేట్స్ రావాలని కోరుకున్న వారిని స్టేజ్ మీదకు రప్పించి, వారిని సర్‌ప్రైజ్ చేశారు. భరణి వాళ్ల అమ్మగారిని తీసుకుని మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) రావడంతో.. అతని ఆనందానికి అవధులు లేవు. ‘బిగ్ బాస్ హౌస్‌లో ఇంతకు మించిన మూమెంట్ లేదు సార్ నాకు. చాలు సార్ నాకు. ఇది బెస్ట్ మూమెంట్.. జీవితాంతం రుణపడి ఉంటాను సార్’ అని భరణి తన సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ‘నా తమ్ముడు నాగబాబు.. భరణికి గురూజీ ఎలా అయ్యాడు?’ అని కింగ్ నాగ్ ప్రశ్నించగా.. ‘నాకు పరిచయమైన కొత్తలో భరణి చాలా అగ్రెసివ్. చాలా సార్లు తిట్టేవాడిని కూడా. కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ గంగిగోవులా అయిపోయాడు. నాకు ఇది కూడా నచ్చలేదు. ఓవర్ సాఫ్ట్ అయిపోయాడు’ అంటూ నాగబాబు చెబుతున్నారు. కళ్యాణ్ వాళ్ల ఫాదర్, బ్రదర్‌ని స్టేజ్ మీదకు పిలిపించి, అతన్ని ఖుషి చేశారు. కళ్యాణ్ (Kalyan) వాళ్ల ఫాదర్ తన ఫ్రౌడ్ మూమెంట్‌ని తెలియజేస్తున్నారు. ఒక బాక్స్ చూపిస్తూ.. అందులో నుంచి కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఆ క్యారెక్టర్స్ హౌస్‌లో ఎవరో చెప్పాలని నాగబాబుని కింగ్ కోరారు. నాగబాబు కార్డు తీయగానే.. జెనీలియా హాసిని పోస్టర్ వచ్చింది. ఆ ట్యాగ్ రీతూకి ఇచ్చారు నాగబాబు. రీతూ పకపకా నవ్వింది.

Also Read- Actress Hema: నా కేసు కొట్టేశారు.. పోయిన నా పరువును తీసుకొచ్చిస్తారా?

ఎన్నిసార్లు వస్తావ్ అన్నా

ఫ్యామిలీ లవ్ అంటూ వచ్చిన మరో ప్రోమోలో.. దివ్య వాళ్ల తాత, ఆమె ఫ్రెండ్ స్టేజ్ మీదకు వచ్చారు. తన ఫ్రెండ్‌ని నాగ్.. ఈ అమ్మాయిని ఎలా భరించేదానికి అని అంటే.. ముందు మా స్నేహం ఎనిమితోనే స్టార్ట్ అయిందని చెబుతోంది. ఇమ్మానియేల్ కోసం అతని తమ్ముడుని తీసుకుని అవినాష్ స్టేజ్ పైకి వచ్చారు. ఇమ్ము నీ కోసం త్యాగం చేస్తే.. నువ్వు టాప్ 5గా హౌస్‌లోకి వెళతావు అనగానే.. అవునా? అంటూ అవినాష్ సమాధానం ఇచ్చాడు. ‘ఎన్నిసార్లు వస్తావ్ అన్నా’ అంటూ ఇమ్ము పంచ్ పేల్చాడు. అవినాష్ కాసేపు తన టైమింగ్ కామెడీతో అందరినీ నవ్విస్తున్నారు. డిమోన్ పవన్‌ని ఇమిటేట్ చేసిన తీరు అయితే హైలెట్ అని చెప్పాలి. మొత్తంగా అయితే ఈ శనివారం ఎంటర్‌టైన్‌మెంట్‌కు లోటు లేదనేలా వచ్చిన ప్రోమోస్ క్లారిటీ ఇచ్చేశాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..