Jupally Krishna Rao: మహిళలకు గౌరవం, సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) అన్నారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మహిళలు స్వశక్తితో ఎదిగి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా పథకాలు తెస్తున్నామని, మహిళలు ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా రాణించాలని అన్నారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, ఆడబిడ్డల శ్రేయస్సు కోసం ఫ్రీబస్ సౌకర్యం కల్పించిందన్నారు. వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా వాటికి యజమానులను చేయడం, అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణను అప్పగించడం, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు అప్పగించడం వంటి చర్యల అనేక కార్యక్రమాల ద్వారా వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళుతున్నామని అన్నారు.
Also Read: Harish Rao: ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి? ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్!
మహిళల అభ్యున్నతి కోసం
ఐదు వందలకే వంటగ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ క్యాంటీన్లు, మీ-సేవ కేంద్రాల బలోపేతం, బస్సుల కొనుగోలుకు లోన్లు, సోలార్ కేంద్రాల ఏర్పాటు, వడ్ల కొనుగోలు సెంటర్ల అప్పగింత, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా సభ్యులకు, లోన్లవంటి ఎన్నో కీలక పథకాలను అమలు చేస్తుంది అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ద్వారా 8 వేల కోట్ల రూపాయలను మిగిల్చిందని, మహిళలు అందరూ బస్సు స్కీంను వినియోగించుకుంటూనే మహిళలు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు అవుతున్నారని మంత్రి సందర్భంగా గుర్తు చేశారు. ప్రజా పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున తెలంగాణ ఆడబిడ్డలకు సారె పెట్టి గౌరవించాలని రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించి, ఇందిరా గాందీ జయంతి రోజున గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీని కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. డిసెంబర్ 9 వరకు 18 ఏళ్లు నిండిన ఇందిరమ్మ చీరలను మహిళలందరికీ చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ చిన్న ఓబులేసు, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, తాహసిల్దార్ శ్రీనివాసులు, అధికారులు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Google AI: నెట్టింట ఏఐ ఫొటోల రచ్చ.. రంగంలోకి గూగుల్.. ఇక వారికి చుక్కలే!

