Maoists Surrender: 37 మంది మావోయిస్టులు లొంగుబాటు
Maoists Surrender (Image Source: Twitter)
Telangana News

Maoists Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. ఏకంగా 37 మంది లొంగుబాటు.. డీజీపీ కీలక ప్రకటన

Maoists Surrender: మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. తుపాకులు వీడి జన జీవన స్రవంతిలో కలిపోయారు. ఈ సందర్భంగా తమ వద్ద ఉన్న 303 రైఫిల్, G3రైఫిల్, SLR, AK47 రైఫిల్, బుల్లెట్స్ ,క్యాట్రేజ్ సీజ్‌ తదితర మారణాయుధాలను పోలీసులకు అందజేశారు. లొంగిపోయిన 37 మంది మావోయిస్టులలో 25 మంది మహిళలు ఉండటం గమనార్హం.

30 ఏళ్లుగా అజ్ఞాతంలో.. 

మావోయిస్టుల లొంగుబాటు అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని స్పష్టం చేశారు. ఏ రకంగా బయటికి వచ్చినా మావోయిస్టులను అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్‌, నారాయణ, ఎర్రాలు తదితరులు ఉన్నట్లు చెప్పారు. ములుగు జిల్లాకు చెందిన ఆజాద్.. తెలంగాణ రాష్ట్ర కమిటి సభ్యుడిగా ఉంటూ 30 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారని డీజీపీ తెలిపారు.

రూ.1.41 కోట్ల రివార్డు

లొంగిపోయిన అజాద్ పేరిట రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలియజేశారు. అలాగే మరో మావోయిస్టు అగ్రనేత అప్పాసి నారాయణ మీద రూ.20 లక్షల రివార్డ్ ఉన్నట్లు చెప్పారు. మిగతావారి మీద ఉన్న వాటిని కూడా కలిపితే రూ.1.41 లక్షలకు రివార్డు మనీ చేరిందని పేర్కొన్నారు. ఆ డబ్బును లొంగిపోయిన 37 మంది మావోయిస్టులకు అందజేయనున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. ఆ రివార్డుతో పాటు ప్రోత్సాహక నగదును సైతం అందిస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: Harish Rao: ఇదేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం.. మీకు మనుసు లేదా.. సీఎంపై హరీశ్ రావు ఫైర్

11 నెలల్లో 465 మంది లొంగుబాటు

గత 11 నెలల వ్యవధిలో 465 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి స్ఫష్టం చేశారు. అయితే తెలంగాణకు చెందిన 59 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టు కేంద్రం కమిటీలో ప్రస్తుతం 9 మంది ఉండగా.. వారిలో ఐదుగురు తెలంగాణకు చెందినవారేనని డీజీపీ స్పష్టం చేశారు. ముప్పల లక్ష్మణ్ అలియాస్ గణపతి, రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం, తిరుపతి అలియాస్ దేవ్ జీ, గణేష్, దామోదర్.. కేంద్ర కమిటీలో ఉన్న తెలంగాణ వారని పేర్కొన్నారు. కాగా మీడియా సమావేశం అనంతరం రివార్డు చెక్కులతో పాటు ప్రోత్సాహక నగదును డీజీపీ స్వయంగా మావోయిస్టులకు అందజేశారు.

Also Read: Tirumala Laddu Case: 20 కోట్ల కల్తీ లడ్డులు.. 11 కోట్ల భక్తులకు విక్రయం.. అంగీకరించిన టీటీడీ!

Just In

01

Mega Interview: మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో వచ్చేసింది..

Gajwel Congress: గజ్వేల్ కాంగ్రెస్ నేతల్లో బలపడుతున్న సంకల్పం.. చేయి కలిపిన మరో వర్గ నేత..?

Vijay Deverakonda: అమ్మకు ప్రామిస్ చేశా.. నెక్ట్స్ సంక్రాంతికి పక్కాగా..!

Drug Awareness: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: గట్ల మహేందర్ రెడ్డి

The Raja Saab: ముగ్గురు భామలతో రాజా సాబ్.. పోస్టర్ అదిరిపోలా..!