Manchu Manoj: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కేవలం నటుడిగానే కాకుండా, తన మనసుకు ఎంతో దగ్గరైన సంగీత ప్రపంచంలోకి కొత్త అడుగు వేశారు. తన సొంత మ్యూజిక్ లేబుల్ “మోహన రాగ మ్యూజిక్” ను అధికారికంగా ప్రారంభించడం ద్వారా ఆయన తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. “లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్” అనే క్యాప్షన్‌తో మన భారతీయ, ముఖ్యంగా తెలుగు సంగీతాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లాలనేది మనోజ్ ప్రధాన లక్ష్యం.
Read also-Story Writers Decline: తెలుగులో కథా రచయితలు తగ్గిపోతున్నారా.. నాగార్జున చెప్పింది నిజమేనా?
సంగీతంతో మనోజ్ అనుబంధం
మనందరికీ మంచు మనోజ్ ఎనర్జిటిక్ నటుడిగా, యాక్షన్ సీన్స్‌లో తన ప్రత్యేకతను చూపించే స్టార్‌గా తెలుసు. అయితే, సంగీతంపై ఆయనకున్న అపారమైన ప్రేమ, ఈ కల కేవలం తనకే కాక, మంచు కుటుంబానికి కూడా చాలా కాలంగా ఉందని మనోజ్ భావోద్వేగంగా వెల్లడించారు. గాయకుడిగా, రచయితగా మనోజ్ గతంలో ‘పోటుగాడు’ చిత్రంలో “ప్యార్ మే పడిపోయా” అనే పాటను పాడారు. అంతేకాక, కరోనా లాక్‌డౌన్ సమయంలో “అంతా బాగుంటాండ్రా” అనే సున్నితమైన పాటను విడుదల చేసి, తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. “పిస్తా పిస్తా,” “ఎన్నో ఎన్నో,” “ప్రాణం పోయే బాధ” వంటి పాటలకు ఆయన సాహిత్యం కూడా అందించారు. మనోజ్ తన తండ్రి డాక్టర్ మంచు మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణు, సోదరి లక్ష్మీ మంచు సినిమాల్లో కూడా సంగీతం, యాక్షన్ విభాగాల్లో తెర వెనుక పనిచేశారు. హాలీవుడ్ చిత్రం ‘బస్మతి బ్లూస్’ కోసం సంగీత దర్శకుడు అచ్చు రాజమణితో కలిసి పనిచేయడం, ఆయన సంగీత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు.
‘మోహన రాగ’ లక్ష్యాలు
‘మోహన రాగ మ్యూజిక్’ లేబుల్ వెనుక మనోజ్ దృష్టి చాలా స్పష్టంగా ఉంది. దీని ద్వారా “ఫ్రెష్ సౌండ్స్, బోల్డ్ టాలెంట్, ఫియర్ లెస్ క్రియేటివిటీ” ని తమ లేబుల్ ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. కొత్త టాలెంట్‌కు ఒక బలమైన ప్లాట్‌ఫామ్‌గా నిలవాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ సాంస్కృతిక నేపథ్యాలను మిళితం చేసే పాటలు, కొత్త ప్రయోగాలు, ఒరిజినల్ సింగిల్స్ ప్రత్యేకమైన కోలాబరేషన్స్‌ను రూపొందించడానికి ‘మోహన రాగ’ సిద్ధమవుతోంది. మనోజ్ తన కుటుంబ వారసత్వాన్ని, కొత్త దృష్టిని మిళితం చేస్తూ, తెలుగు సంగీతాన్ని ప్రపంచానికి మరింత దగ్గర చేయాలనే దృక్పథంతో ఈ లేబుల్‌ను ఏర్పాటు చేశారు.
Read also-RGV Piracy Comments: ‘రాబిన్ హుడ్ రవి’ సిద్ధాంతంపై రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్.. ఏమన్నారంటే?..
అభినందనలు
ఈ ప్రకటన వెలువడగానే, మంచు మనోజ్ అభిమానులు, నెటిజన్లు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నటుడిగా ఆయన కెరీర్‌లో ఒక కొత్త దశలోకి అడుగుపెడుతున్న ఈ సమయంలో, సంగీతంపై ఆయనకున్న మక్కువ ఈ కొత్త వెంచర్‌ను విజయవంతం చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. మోహన రాగ అనే పేరు మంచు మనోజ్‌కు మరియు ఆయన తండ్రి మోహన్ బాబుకు ఎంతో ప్రత్యేకమైన భావాన్ని కలిగి ఉన్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఈ మ్యూజిక్ లేబుల్ ద్వారా విడుదల కానున్న ఒరిజినల్ పాటలు, అంతర్జాతీయ స్థాయి సహకారం గురించిన ప్రకటనల కోసం సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Music has always been my escape, my expression, my truth.
Today, that journey evolves.
Introducing my new global music venture,Mohana Raga Music 🙏🏾❤️
Built for fresh sounds, bold talent, and fearless creativity. 🎼🌍#MohanaRagaMusic #GlobalMusic #FreshSounds #BoldTalent… pic.twitter.com/iyK27jzqyM
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 22, 2025
