Champion First Single: యువ కథానాయకుడు రోషన్ మేక, నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రదీప్ అద్వైతం కాంబినేషన్‌లో వస్తున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘చాంపియన్’. ఈ సినిమా నుంచి తాజా అప్‌డేట్ సినిమా వర్గాలలో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో కథానాయికగా మలయాళీ నటి అనస్వర రాజన్ తెలుగు తెరకు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె పాత్ర’చంద్రకళ’ కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు నిర్మాతలు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రోమోతో సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు సినిమాలోని మొదటి పాట విడుదల తేదీని ప్రకటించారు.
Read also-RGV Piracy Comments: ‘రాబిన్ హుడ్ రవి’ సిద్ధాంతంపై రామ్ గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్.. ఏమన్నారంటే?..
ఛాంపియన్ సినిమా నుంచి చంద్రకళ పాత్రను పరిచయం చేస్తూ, చిత్ర బృందం ‘గిర గిర గింగిరాగిరే’ (GiraGiraGingiraagirey) అనే టైటిల్‌తో కూడిన ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. ఛాంపియన్ మొదటి సింగిల్ నవంబర్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు అందులో తెలిపారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటపై సినీ అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లలో, అనస్వర రాజన్ సాంప్రదాయ రెట్రో శైలి దుస్తుల్లో కనిపించి, ‘చంద్రకళ’ పాత్ర కథలో ఎంతగానో ప్రభావం చూపేదిగా ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. ఆమె చూపులో కనిపించిన భావోద్వేగం, పాత్రలోని లోతును తెలియజేసింది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కథకు బలం చేకూర్చే పాత్రలో ఆమె నటిస్తుందని తెలుస్తోంది.
Read also-NC24 Title Launch: నాగచైతన్య ‘NC24’ టైటిల్ గురించి అప్డేట్ ఇచ్చిన నిర్మాతలు.. లాంచ్ చేసేది ఎవరంటే?
‘చాంపియన్’ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పిస్తుండగా, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ బ్యానర్లపై ప్రియాంక దత్, జీకే మోహన్, జెమినీ కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ ‘గిర గిర గింగిరాగిరే’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. R. మాధీ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, తోట తరణి ప్రొడక్షన్ డిజైన్ వంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేస్తుండటం విశేషం. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ‘చాంపియన్’, పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా అంచనాలను పెంచుతోంది. రోషన్ ఫుట్‌బాల్ ఆటగాడిగా కనిపించనున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ పాత్ర పరిచయం, ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ సినిమా ప్రమోషన్స్‌లో కీలకంగా మారాయి. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ సాంగ్ ప్రోమోను చూస్తుంటే.. మిక్కీ జే మేయర్ నుంచి మరో మంచి మెలొడీ రాబోతుందని తెలుస్తోంది. రామ్ మిరియాల అందించిన గాత్రం మరోసారి మ్యేజిక్ చేయబోతుంది. ఈ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
