KTR Prosecution Report: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేస్ కేసు మరోమారు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై చార్జి షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో కేటీఆర్ అరెస్టు కూడా ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఫార్ములా ఈ – కారు కేసుకు సంబంధించి ప్రభుత్వానికి ఏసీబీ సమర్పించిన ప్రాసిక్యూషన్ రిపోర్ట్ తాజాగా బయటకు వచ్చింది. అందులో కీలక విషయాలు వెలుగుచూశాయి.
క్విడ్ ప్రోకో జరిగినట్లు నిర్ధారణ
కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు సంబంధించిన ఈ రిపోర్ట్ ను సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి ఏసీబీ సమర్పించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. 2024 డిసెంబర్ 19న ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అందులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ4గా మల్లీశ్వరరావు, ఏ5గా ఎఫ్ఈఓ సీఈఓ ఉన్నారు. అయితే హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేసు నిర్వహించాలనేది కేటీఆర్ సొంత నిర్ణయమని రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్లతో రేస్ నిర్వహించినట్లు పేర్కొంది. దీని ద్వారా క్విడ్ ప్రోకో సైతం జరిగినట్లు నిర్ధారించింది. బీఆర్ఎస్ పార్టీకు రూ. 44 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ వచ్చాయని నివేదిక తెలిపింది. ‘ట్రైపార్టీ అగ్రిమెంట్ కి ముందే ఎలక్ట్రోరల్ బాండ్స్ ను చెల్లించారు. 2022 ఏప్రిల్ అక్టోబర్ నెలలో ఈ బాండ్స్ ను చెల్లించారు. బీఆర్ఎస్ కు ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చినందుకు ఏస్ నెక్ట్స్ జెన్ (ace NXT gen) కు ప్రమోటర్ గా అవకాశం కల్పించారు’ అని ఫైనర్ రిపోర్ట్ పేర్కొంది.
‘కేసీఆర్ కు సమాచారం ఇవ్వలేదు’
గవర్నర్ సంతకంతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన కాంట్రాక్టులను కాంపిటీoట్ అథారిటీ అనుమతి లేకుండానే ఐఏఎస్ అరవింద్ కుమార్ జారీ చేశారని ఏసీబీ ఫైనర్ రిపోర్ట్ పేర్కొంది. ‘హెచ్ఎండిఏ ప్రమోటర్ గా ఉండేందుకు హెచ్ఎండిఏ నిధులను ఉపయోగించారు. రాష్ట్ర ఆర్థిక శాఖకు సైతం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదు. బిజినెస్ రూల్స్ ను ఉల్లంఘిస్తూ అప్పటి రాష్ట్ర సీఎస్ కు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రికి, అప్పటి ముఖ్యమంత్రి (కేసీఆర్)కి సైతం ముందస్తు సమాచారం ఇవ్వలేదు. రూ.10 కోట్ల కంటే అధిక నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. 2023 అక్టోబర్ 9 నుండి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. వాటిని సైతం లెక్కచేయలేదు. ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండానే చెల్లింపులతో పాటు అగ్రిమెంట్లు చేసి ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడ్డారు.
‘రూ.600 కోట్ల భారం పడింది’
ట్రై పార్టీ అగ్రిమెంట్ లో లేకపోయినప్పటికీ సీజన్ 9 నిర్వహణ కోసం రూ.20 కోట్లు ఖర్చు పెట్టింది. ట్రై పార్టీ అగ్రిమెంట్లో హెచ్ఎండిఏ లేకపోయినా అరవింద్ కుమార్ తో పాటు బిఎల్ఎన్ రెడ్డి.. ఎఫ్ఈఓ (FEO)కు రూ.46 కోట్లు చెల్లించాలని బిల్ పాస్ చేశారు’ అని ఫైనల్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినందుకు టాక్స్ తో పాటు జీఎస్టీ ఫైన్ సైతం హెచ్ఎండిఏ పై అదనంగా రూ.8 కోట్ల భారం పడినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది. 2023 అక్టోబర్ 30న చేసుకున్న సెకండ్ అగ్రిమెంట్ కారణంగా సీజన్ 10, 11, 12 కలిపి ప్రభుత్వంపై రూ. 600 కోట్ల భారం పడుతుంది. హెచ్ఎండిఏ ఎంటర్ కాకుండా ఉండి ఉంటే ఈ బాధ్యత అంతా ace NXT gen మీద ఉండేదని అన్నారు.
Also Read: Maoists Surrender: నేడు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్న మావోయిస్టు కీలక నేతలు!
నైల్ సేన్ రిపోర్టు బూటకం..
నైల్ సేన్ నివేదికను కేటీఆర్ చూపిస్తూ పదేపదే రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని అబద్ధాలు చెప్పారని ప్రాసిక్యూషన్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ‘రూ.700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి లాభం వచ్చినట్లు ఒక్క రిపోర్టు కూడా లేదు. ఈ రిపోర్టు ఒక బూటకం అని దర్యాప్తులో తేలింది. దర్యాప్తులోనూ నైల్ సన్ సహకరించలేదు కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకుని, అక్రమ పద్ధతిలో అనుమతులు మంజూరు చేశారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంత లాభం కోసం రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకున్నాడు. ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, మల్లేశ్వరరావు, ఎఫ్ఈఓ సీఈఓ ఇందుకు సహకరించారు’ అని ప్రభుత్వానికి సమర్పించిన ఫైనర్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది.
