NC24 Title Launch: యువ సామ్రాట్ నాగ చైతన్య (NC) అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపారు నిర్మాతలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘NC24’ చిత్రం టైటిల్ లాంచ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా టైటిల్ లాంచ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ టైటిల్‌ను విడుదల చేయబోతున్నారు. ఇది అక్కినేని, ఘట్టమనేని అభిమానులందరికీ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. నాగ చైతన్య తన కెరీర్‌లో వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన నుంచి రాబోతున్న ప్రతి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. NC24 చిత్రంపై కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో, నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 23వ తేదీ, ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ ప్రకటన విడుదలైన వెంటనే, సోషల్ మీడియాలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
యువసామ్రాట్ నాగ చైతన్య తన కెరీర్‌లోనే ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన 24వ చిత్రం ( NC24), ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందించగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాను ఒక హై-బడ్జెట్ మైథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ‘విరూపాక్ష’తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన కార్తీక్ దండు, ఈసారి పౌరాణిక అంశాలు, చారిత్రక రహస్యాలు ముడిపడిన ఒక సాహస కథాంశాన్ని ఎంచుకున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ కథకు పర్యవేక్షణ మాత్రమే కాకుండా, నిర్మాణంలో కూడా భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇది సినిమా కంటెంట్ పట్ల మేకర్స్‌కు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
Read also-Shivajyothi controversy: వివాదంలో చిక్కుకున్న యాంకర్ శివజ్యోతి.. ఇదంతా కావాలనే చేసిందా..
ఈ చిత్రంలో నాగ చైతన్య ఒక నిధి అన్వేషకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇందుకోసం చైతన్య ప్రత్యేకంగా యాక్షన్, ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆయన పాత్ర చుట్టూ అంతుచిక్కని పౌరాణిక రహస్యాలు, పురాతన ఆలయాలు ప్రమాదకరమైన ప్రయాణం ప్రధానంగా ఉంటాయి. ఈ సినిమా కోసం ఆర్కియాలజీ నేపథ్యం ఉన్న నటిగా మీనాక్షి చౌదరిని కథానాయికగా ఎంచుకున్నారు. ఈ సినిమా కు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ‘కాంతార’, ‘విరూపాక్ష’ చిత్రాలకు మ్యూజిక్ అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (SVCC) పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నాగ చైతన్యకు పాన్ ఇండియా స్థాయిలో మంచి బ్రేక్ ఇస్తుందని, మరియు తెలుగు సినిమాకు మరో అద్భుతమైన యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ విడుదల కోసం నాగచైతన్య అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
#SSMBforYUVASAMRAT ❤️🔥❤️🔥❤️🔥#Globetrotter, Superstar @urstrulyMahesh garu to launch the #NC24 Title and First Look Poster tomorrow at 10:08 AM 🦁🌏🔥
Stay tuned 💥 💥@chay_akkineni @karthikdandu86 @Meenakshiioffl @BvsnP @aryasukku #SparshShrivastava #RagulDHerian @AJANEESHB… pic.twitter.com/iIeoCFP01H
— SVCC (@SVCCofficial) November 22, 2025
