The RajaSaab First Single: ‘ది రాజాసాబ్’ నుంచి అదిరిపోయే అప్డేట్
prabhas( image :X)
ఎంటర్‌టైన్‌మెంట్

The RajaSaab First Single: థమన్ చెప్పేది వింటే ప్రభాస్ ఫ్యాన్స్ ఎగిరి గెంతాల్సిందే.. యూట్యూబ్ ఊపిరి పీల్చుకో..

The RajaSaab First Single: ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab) నుండి ఫస్ట్ సింగిల్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. థమన్ తాజాగా ఈ పాట గురించి వెల్లడించిన విషయాలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ పాటకు సంబంధించిన తాజా అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపుతోంది. ‘ది రాజాసాబ్’ తొలి పాట గురించి థమన్ మాట్లాడుతూ… “ఈ సాంగ్ లిరికల్ వీడియో ఇప్పుడే పూర్తయింది. సాంగ్ అదిరిపోతుంది” అని చెప్పడం ద్వారా పాట స్థాయిని స్పష్టం చేశారు. ఈ మాటలు ప్రభాస్ అభిమానుల గుండెల్లో ఉత్సాహభేరి మోగించాయి. పాట కచ్చితంగా చార్ట్‌బస్టర్‌గా నిలవడం ఖాయమనే నమ్మకాన్ని ఈ మాటలు కల్పిస్తున్నాయి.

Read also-Shivajyothi controversy: వివాదంలో చిక్కుకున్న యాంకర్ శివజ్యోతి.. ఇదంతా కావాలనే చేసిందా..

అంతే కాకుండా.. డార్లింగ్ 11 సంవత్సరాల తర్వాత యూట్యూబ్ ను కుమ్మబోతున్నాడు.అసలు మామూలుగా ఉండదు. అభిమానులు అయితే ఈ సాంగ్ అసలు మర్చిపోలేరు. సాంగ్ మీద రీల్స్ చేయడానికి రెడీ గా ఉండండి. ఈ సారి అదిరిపోతుంది సాంగ్’ అంటూ చెప్పుకొచ్చారు తాజాగా దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఎన్నో అంచనాలు వస్తున్న ఈ సినిమాపై థమన్ చెప్పిన మాటలు అభిమానులకు మరింత ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వరుస అప్డేట్‌లు, ముఖ్యంగా ప్రోమో, పాట విడుదలకు మధ్య కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటం, ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌గా మారింది. ఈ పాటను చూసేందుకు ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read also-Tollywood: ట్రెండ్ మారింది.. సినిమా పబ్లిసిటీకి స్టార్స్ అవసరం లేదు.. ఆ పాత్ర కూడా జర్నలిస్ట్‌లదే!

‘ది రాజాసాబ్’ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, వి. సెల్యులాయిడ్ బ్యానర్లపై నివాస్, సునీల్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మాణంలో వస్తున్న ఈ హారర్-కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచనుంది. ఈ చిత్రంలో ప్రభాస్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ‘ది రాజాసాబ్’ నుండి మొదటి సింగిల్ వస్తుందన్న ప్రకటనతో, మ్యూజికల్ చార్ట్‌లలో ప్రభాస్ సునామీ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. విడుదలయ్యే ప్రోమో కోసం, ఆపై పాట కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైటర్ ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. అయితే ‘ఓజీ’, ‘అఖండ 2’లతో మంచి ఊపుమీదున్న సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి కూడా వాటిని మించే రేంజ్ లో సంగీతం అందిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ పాట ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరొక్క రోజు ఆగాల్సిందే.

Just In

01

Sai Durgha Tej SYG: ఎద్దును పట్టుకుని.. ఊరమాస్ అవతార్‌లో తేజ్.. పోస్టర్ వైరల్!

Municipal Elections: మున్సీపాలిటీ వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ.. నేడో రేపో రిజర్వేషన్ల ఖరారు

kite Accident: పండుగరోజు విషాదం.. గాలిపటం ఎగిరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి గాయాలు

Maoist Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. 52 మంది మావోయిస్టులు సరెండర్..!

Nabha Natesh: అతిలోక సుందరిలా నభా.. ‘నాగబంధం’ ఫస్ట్ లుక్ చూశారా?