Shivajyothi controversy: వివాదంలో చిక్కుకున్న యాంకర్ శివజ్యోతి..
shiva-jyothi(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Shivajyothi controversy: వివాదంలో చిక్కుకున్న యాంకర్ శివజ్యోతి.. ఇదంతా కావాలనే చేసిందా..

Shivajyothi controversy: ప్రముఖ యాంకర్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ శివజ్యోతి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు హిందూ ధార్మిక సంఘాలతో పాటు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. తాజాగా, శివజ్యోతి తన భర్త , స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు క్యూ లైన్‌లో నిలబడి ఉండగా, భక్తులకు పంపిణీ చేసిన ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తూ శివజ్యోతి, ఆమె స్నేహితుడు చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. వీడియోలో వారు, “తిరుమలలో ‘కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నామని'” “‘రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే'” అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను శివజ్యోతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయింది.

Read also-IBomma Piracy Case: ‘ఐ బొమ్మ’ రవి చుట్టూ బిగుసుకుంటున్న కేసుల ఉచ్చు.. బయటకు రావడం కష్టమేనా?

హిందువులకు శ్రీవారి ప్రసాదం కేవలం ఆహారం కాదు, అది దైవత్వపు అనుగ్రహంగా భావిస్తారు. స్వామివారి ప్రసాదాన్ని ‘అడుక్కోవడం’ వంటి పదజాలంతో పోల్చడం, ఆ పవిత్రతను కించపరచడమేనని భక్తులు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయం అయిన తిరుమలలో ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయడాన్ని గౌరవంగా చూడాలి తప్ప, ఇలా అగౌరవపరచడం సరికాదని విమర్శలు వెల్లువెత్తాయి. శివజ్యోతి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనేక హిందూ ధార్మిక సంఘాలు ఆమెపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఆలయ పవిత్రతను కాపాడేందుకు టీటీడీ (TTD) ఇప్పటికే పలు నిషేధాజ్ఞలు విధించినప్పటికీ, ప్రముఖులు ఇలాంటి వివాదాస్పద వీడియోలు చేయడం పట్ల వారు మండిపడుతున్నారు.

Read also-GHMC: అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ మాత్రమే కాదు.. తవ్వుతున్న కొద్దీ అక్రమాలు!

సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉండే యాంకర్ శివజ్యోతి గతంలోనూ కొన్ని వీడియోల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే, మతపరమైన, ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రమైన చర్చకు దారితీశాయి. స్వామివారి పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదని, శివజ్యోతి తక్షణమే క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దేవుడిపై నమ్మకం లేదని చెప్పిన రాజమౌళి విషయంలో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. అలాంటి సమయంలో శివ జ్యోతి కూడా ఇలా మతపరమైన విషయాల్లో నిలవడం చర్చనీయాంశం అయింది. అయితే ఆమె ఇలా ఏ ఉద్దేశంతో అందో తెలియదు కానీ.. ఇదంతా పబ్లిసిటీ కోసమే అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుని మాట్లాడాలని కామెంట్లు పెడుతున్నారు.

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!