3 Roses S2 Teaser: చీజ్ బజ్జీలు, హాట్ గాళ్స్‌తో.. టీజర్ రివ్యూ!
3 Roses S2 Teaser (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

3 Roses S2 Teaser: చీజ్ బజ్జీలు, హాట్ గాళ్స్‌తో.. ఈసారి గట్టిగానే ప్లాన్ చేశారుగా!

3 Roses S2 Teaser: 2021లో ఆహా ఓటీటీలో వచ్చిన ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ సీజన్ 1కు కొనసాగింపుగా సీజన్ 2 రాబోతోంది. అయితే సీజన్ 2లో చాలా మార్పులు జరిగాయి. నిర్మాణ సంస్థ మారింది. అందులో ప్రధాన పాత్రలు పోషించిన ఇద్దరు హీరోయిన్లు మారారు. మొదటి సీజన్‌లో ఈషా రెబ్బ, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ నటిస్తే.. ఈ సీజన్ 2‌లో మాత్రం ఈషా రెబ్బా (Eesha Rebba)ను కంటిన్యూ చేసి.. మరో ఇద్దరు హాట్ గాళ్స్‌ను యాడ్ చేశారు. ఆ విషయం తాజాగా వచ్చిన టీజర్, ఈ టీజర్‌కు ముందు వచ్చిన ప్రమోషనల్ వీడియోస్ చెప్పేస్తున్నాయి. పాయల్, పూర్ణ ప్లేస్‌లలో ఈసారి రాశీ సింగ్ (Rashi Singh), కుషిత (Kushitha)లను తీసుకున్నారు. మొదటి పార్ట్ రితిక, జాన్వీ, ఇందుల ప్రేమ, వివాహం, కెరీర్‌లను బేస్ చేసుకుని వస్తే.. ఈసారి ఇంకాస్త డోస్ పెంచినట్లుగా అర్థమవుతోంది. అసలీ టీజర్‌ (3 Roses S2 Teaser)లో ఏముందంటే..

Also Read- Akhanda 2 Trailer: ‘అఖండ 2: తాండవం’ మూవీ ట్రైలర్ ఎలా ఉందంటే..

ప్రతి నార్త్ ఈస్ట్ వాడిని చూసి..

ముంబైలో ఈ సీజన్‌ని ప్లాన్ చేశారు. ఇక్కడ కూడా త్రీ రోజెస్సే అంటూ ఇషా, ఈ సీజన్‌‌పై ఫస్ట్ షాట్‌లోనే క్లారిటీ ఇచ్చేసింది. ఇందులో త్రీ రోజెస్ ఎవరో తెలుసా? అంటూ మేఘనగా రాశీ సింగ్‌ని, శ్రష్ఠిగా కుషితను పరిచయం చేశారు. మధ్యలో సత్య కిక్కిచ్చే ఎంట్రీ. రోడ్డు మీద కనిపించే ప్రతి నార్త్ ఈస్ట్ వాడిని చూసి చాలా క్యూట్ ఉన్నాడనేలా శ్రష్టి పాత్రని రివీల్ చేశారు. నైట్ ఏమైనా జరిగిందా? అని శ్రష్ఠి ఓ ఇంటెన్స్ సీన్ తర్వాత అడుగుతుంటే.. అయితే అయ్యిండొచ్చు.. అవకపోతే అవకపోయి ఉండొచ్చు.. అనే సమాధానం విని ఆమె షాకయింది. ఈ రోజు నుంచి అంతా మంచే జరుగుతుంది. మన లైఫ్‌లో గుడ్ టర్న్ రాబోతుంది అని రాశీ సింగ్ అంటుంటే.. అక్కడ జరగరానిది ఏదో జరిగినట్లుగా సీన్ కట్ చేశారు.

Also Read- The Great Pre-Wedding Show OTT: ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో’ స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

చీజ్ బజ్జీల కోసమే పబ్‌కు..

కట్ చేస్తే.. ‘అయినా మనకు కావాల్సింది హీరో అవడం కాదు.. విలన్ అవడం’ అంటూ సత్య ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఏంటి మ్యాగీ మన పరిస్థితి ఇలా అయిపోయిందని ఈషా అంటుంటే.. ‘ఎక్కడికి వెళ్తార్రా.. ఎక్కడికి వెళ్లినా ఇక్కడికే వస్తారు’ అంటూ సత్య డైలాగ్‌తో.. అతనికి వాళ్లు ఏదో అన్యాయం చేశారనేది తెలుస్తుంది. వెంటనే హర్ష అదిరిపోయే ఎంట్రీ. ‘ఫ్రాన్స్ నుంచి వచ్చి ఫ్రాన్స్ తీసుకుంటున్నా.. రైమింగ్ ఓకేనా’ అని హర్ష అంటుంటే త్రీ రోజెస్ అవాక్కవుతున్నారు. ‘రీతూ ఏం చేస్తుంది? ఎవరితో తిరుగుతుంది? అనే ఇన్‌ఫర్మేషన్ మీరు నాకు ఇవ్వాలి.. ఇదే మన మిషన్..’ అని కొంతమందిని హర్ష అపాయింట్ చేశాడు. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాల తర్వాత.. ‘ఈసారి గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నారుగా’ అనే వాయిస్ ఓవర్‌కు.. ‘ఇప్పుడే ఏం చూశావ్.. ముందు ముందు ఇంకా ఉంటుంది’ అని మరో వాయిస్ సమాధానం. కట్ చేస్తే.. ముగ్గురు లేడీస్ పబ్‌లో ఎంజాయ్ చేస్తుండగా.. వెయిటర్‌ని శ్రష్ఠి చీజ్ బజ్జీలు అడుగుతుంది. అవి పబ్‌లో ఎందుకు ఉంటాయే అని రీతూ అంటే.. నేను ఎప్పుడూ అవి తింటానికే కదా.. పబ్‌కి వస్తాను అని శ్రష్టి సమాధానం ఇచ్చింది. ఇది చాలు కదా.. ఈ సీజన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియజేయడానికి. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సీజన్ 2 డిసెంబర్ 12 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Jogipet News: ప్రజల దృష్టిని ఆకర్షించేలా చేసిన ఓ యువకుడు.. గుర్రంపై వచ్చి నామినేషన్!

Shocking Video: 20 అడుగుల గోడ దూకి.. సింహాల బోనులోకి వెళ్లాడు.. తర్వాత ఏమైదంటే?

Modi vs Priyanka: ప్రధాని మోదీ వర్సెస్ ప్రియాంక గాంధీ… మాటల తూటాలు.. మోదీ ఏమన్నారో తెలుసా?

CM Revanth Reddy: హడ్కో ఛైర్మ‌న్ సంజ‌య్ కుల‌శ్రేష్ఠ‌తో సీఎం రేవంత్ భేటి.. కీలక అంశాలపై చర్చ

Viral Video: కార్పొరేట్ ఉద్యోగం వదిలి ఆటో డ్రైవర్ ను అయ్యా.. జీవితంలో చాలా పాఠాలు నేర్చుకున్నా.. వీడియో వైరల్