Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 75వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 75) ఇమ్ము ఫ్యామిలీ ఎంట్రీతో పాటు, కెప్టెన్సీ ఫైట్ కూడా నడుస్తోంది. ఇప్పటికే హౌస్‌లోకి వచ్చిన హౌస్‌మేట్స్ ఫ్యామిలీ.. వారి బాండింగ్‌తో అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేసిన విషయం తెలిసిందే. కొన్ని వారాలుగా ఇంటిని వదిలి ఉంటున్న హౌస్‌మేట్స్‌కి ఈ వారం ఫ్యామిలీని రప్పించి.. కాస్త రిలీఫ్ ఇచ్చారు బిగ్ బాస్. ఫ్యామిలీ హంగామా అనంతరం కెప్టెన్సీ టాస్క్‌కు సంబంధించి బిగ్ బాస్ ఇచ్చిన షరతు విషయంలో దివ్య, తనూజ మధ్య సీరియస్ ఫైట్ నడుస్తోంది. 75వ రోజైన శుక్రవారానికి సంబంధించిన వచ్చిన ప్రోమోస్ చూస్తుంటే.. ఎమోషనల్ బాండింగ్స్ నుంచి వీక్షకులకు కూడా కాస్త రిలీఫ్ వచ్చినట్టే భావించవచ్చు. ఎందుకంటే, నాలుగైదు రోజులుగా హౌస్‌లోకి హౌస్‌మేట్స్ ఫ్యామిలీ రావడం, ఏడ్వటం.. ఏవో నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోవడం చూసి చూసి వీక్షకులకు కూడా చిరాకు వచ్చేస్తుంది. ఫైనల్‌గా ఇమ్ముతో ఆ డ్రామాకు తెరదించి.. అసలైన ఆటలోకి మళ్లీ బిగ్ బాస్ తెచ్చేసినట్లుగా ఈ ప్రోమోలు తెలియజేస్తున్నాయి. ఇక తాజాగా వచ్చిన ప్రోమోస్‌ని ఒక్కసారి గమనిస్తే..
ఇమ్ము ఫ్యామిలీ ఎంట్రీ.. (Emmanuel Family Entry)
ఇమ్ము తన మదర్ కోసం వెయిట్ చేస్తుండగా.. ఆమె గేట్ నుంచి కాకుండా.. డైరెక్ట్‌గా ఇంట్లోని రూమ్ నుంచి వచ్చారు. ఫస్ట్ తనూజ ఆమెని చూసి, ఇమ్ముని పిలుస్తున్నారు. ఇమ్ము తన మదర్ పట్టీల చప్పుడు వినే, ఆమె వచ్చినట్లుగా చెప్పడం.. అతని ప్రేమని తెలియజేస్తుంది. ఇమ్ము (Emmanuel) మదర్‌ని తనూజ, రీతూ కలిసి ఓపెన్ ప్లేస్‌లో ఉన్న అతని దగ్గరకు తీసుకొచ్చారు. ఇమ్మూ తల్లి అంటూ ఆమె ఆప్యాయంగా పిలుస్తుంటే.. ఇమ్ము ఎమోషనల్ అవుతున్నాడు. హౌస్‌మేట్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. వాళ్ల అమ్మతో కాసేపు ఆటలు ఆడిన ఇమ్ము.. ఆమె చేతిని తీసుకుని.. ఇవి నేను కొనిపించిన గాజులే అని చెబుతున్నాడు. ఇమ్ము పొట్టపై ఆమె పేల్చిన పంచ్, ఇమ్ము రేంజ్ గురించి ఆమె చెప్పిన డైలాగ్స్ హైలెట్ అనే చెప్పాలి. ‘కమెడియన్‌గా లోపలికి వచ్చావు.. హీరోలెక్క బటయకు రావాలబ్బా’ అంటూ ఆమె ఇస్తున్న ఎనర్జీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే. అందరి ఫ్యామిలీల్లా కాకుండా.. ఇమ్ము మదర్ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ.. చాలా సింపుల్‌గా హౌస్‌మేట్స్‌తో కలిసిపోయారు. ‘ఎంత రాణులు అయితే మాత్రం.. మా వాడితో స్టెప్ వేయిస్తావా?’ అంటూ ఆమె స్టెప్ వేయడం, ‘మా అబ్బాయి నడుముని ఎందుకు అలా గిల్లావ్.. చూడు ఎంత తగ్గిపోయిందో’ అంటూ ఇమ్ము మదర్ పేల్చిన పంచ్‌లకు అందరూ హాయిగా నవ్వుకున్నారు. చివరిగా ‘లోఫర్’ సినిమాలోని మదర్ సాంగ్‌ను ఇమ్ము పాడి.. అందరినీ ఖుషి చేశారు.
Also Read- VK Naresh: వీకే నరేష్‌లో ఉన్న నటుడిని పక్కన పెట్టి.. ఆ (పవిత్ర) కోణంలోనే చూస్తున్నారా?
హౌస్ ఫైట్ (House Fight)
ఇక హౌస్ ఫైట్ అంటూ వచ్చిన రెండో ప్రోమోలో.. ‘మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని భావిస్తున్నారో.. వారిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగించండి’ అని బిగ్ బాస్ కండీషన్ పెట్టగా.. దివ్య వచ్చి తనూజ పేరు చెప్పింది. ‘ఈ వారం నువ్వే కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టి.. 12వ వారం ఎండ్ వరకు నీకు ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి.. నిన్ను కెప్టెన్సీ రేసు నుంచి తొలగించాలని అనుకుంటున్నాను’ అని మంచిగానే ఆలోచించి దివ్య చెప్పింది. ‘నేను ఆడి సంపాదించుకున్నాను.. బిహేవియర్ పరంగా కాదు’ అంటూ తనూజ కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయింది. దీంతో ఇద్దరి మధ్య సీరియస్‌గా వాగ్వివాదం (Divya vs Tanuja) నడుస్తుంది. హద్దులు దాటి మాట్లాడుకునే వరకు వెళ్లడంతో.. హౌస్‌మేట్స్ వచ్చి, వారిద్దరినీ కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ ఏడుస్తూ బాధపడుతున్నారు. మొత్తంగా అయితే.. ఫ్యామిలీ టైమ్ తర్వాత.. హౌస్‌లో మరోసారి ఫైర్ మొదలైంది. ఫైనల్‌గా ఈ కెప్టెన్సీ ఎపిసోడ్ ఎటువైపుకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
