KTR on Land Scam: సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
KTR on Land Scam (Image Source: Twitter)
Telangana News

KTR on Land Scam: దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

KTR on Land Scam: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్.. దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం రాష్ట్రంలో జరుగుతున్నట్లు ఆరోపించారు. తనకు ఎదురైన అనుభవం, అవగాహనతోనే ఈ భూ కుంభకోణం గురించి మాట్లాడుతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.

‘9 వేల ఎకరాలు కొల్లగొట్టారు’

రాష్ట్రంలోని 9,292 ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అనుచురు కొల్లగొడుతున్నారని కేటీఆర్ (KTR) ఆరోపించారు. సుమారు రూ.5 లక్షల కోట్ల విలువ చేసే భూమికి వారు టెండర్ పెడుతున్నారని అన్నారు. బాలానగర్‌, కాటేదాన్‌, జీడిమెట్లలో తన వాళ్లకు రేవంత్‌ భూములిచ్చారని అన్నారు. ఎ.వి. రెడ్డి, కొండల్ రెడ్డి , తిరుపతి రెడ్డి కలిసి ఈ భూ కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. జపాన్ లో ఉన్నప్పుడు కూడా ఆ భూములకు సంబంధించి రేవంత్ ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు.. భూముల చుట్టే పరిభ్రమిస్తున్నట్లు విమర్శించారు.

‘భూములను కాపాడతాం’

సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు దోచుకోవాలని చూస్తున్న భూములను న్యాయ పోరాటం చేసి కాపాడుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల భూమిని లాక్కోకుండా.. ప్రభుత్వ స్థలంలోనే ఇందిరమ్మ ఇళ్లు, ఆసుపత్రులను కట్టాలని కేటీఆర్ సూచించారు. ప్రజల భూమిని అప్పనంగా పారిశ్రామిక వేత్తలకు కట్టబెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న కేటీఆర్.. ఈ భూముల వల్ల తమకే సమస్యలు ఎదురయ్యే అవకాశముందని పేర్కొన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని సూచించారు. భూసంస్థల యజమానుల్లో కొందరు బీజేపీ వారు కూడా ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు.

Also Read: iBomma in SBI: ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో.. ఐబొమ్మ పైరసీ లింక్స్.. అవాక్కైన పోలీసులు!

‘అరెస్ట్ చేసే ధైర్యం చేయరు’

ఫార్ములా ఈ – కారు రేసు కేసులో త్వరలో తనను ఆరెస్టు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపైనా కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అంటూనే.. సీఎం రేవంత్ తనను అరెస్ట్ చేసే ధైర్యం చేయరని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. లై డిటెక్టివ్ టెస్టుకు తాను రెడీ అని.. ఈ – కారు కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డి కూడా తెలుసన కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు కడియం శ్రీహరిని కాపాడేందుకు దానం నాగేందర్ తో రాజీనామా చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని అభిప్రాయపడ్డారు.

Also Read: Formula E Race Case: కేటీఆర్ అరెస్ట్‌పై ఉత్కంఠ.. ఉచ్చుబిగుస్తున్న ఏసీబీ.. మళ్లీ గవర్నర్ కోర్టుకే బంతి!

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!