KTR: సౌదీ మృతుల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్..
KTR ( image credit: swetcha reporter)
Political News

KTR: సౌదీ మృతుల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్.. సహాయసహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ

KTR: సౌదీ అరేబియాలో ఇటీవల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ముషీరాబాద్ యాత్రికుల కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బీఆర్ఎస్ తరఫున మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మృతదేహాల తరలింపు లేదా ఇతర ఏమైనా కార్యక్రమాలు చేయాల్సి ఉంటే, వాటిని పూర్తి చేయడానికి విదేశాంగ అధికారులతో స్వయంగా మాట్లాడతామని కేటీఆర్ వెల్లడించారు. మరణించిన వారి పట్ల పూర్తి శ్రద్ధ వహించడానికి ఇప్పటికే బీఆర్ఎస్ పక్షాన తమ బృందం సౌదీ అరేబియాకు వెళ్లిందని తెలిపారు.

Also Read: KTR: భవిష్యత్ లో జూబ్లీహిల్స్ లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తాం : కేటీఆర్

తొలి పేరు రామయ్యదే

విద్యారంగానికి చుక్కా రామయ్య చేసిన సేవలు అపారమని కేటీఆర్ కొనియాడారు. 100వ జన్మదినం జరుపుకుంటున్న రామయ్యకు విద్యానగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవితను తీర్చిదిద్దిన వ్యక్తి రామయ్య అని కేటీఆర్ ప్రశంసించారు. ఐఐటీ అనగానే గుర్తుకొచ్చే తొలి పేరు, విద్య అంటే గుర్తుకొచ్చే మార్గదర్శి, సేవ అంటే గుర్తుకొచ్చే స్ఫూర్తి అంతా చుక్కాదే అన్నారు. వేలాదిమంది విద్యార్థులను ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థలకు పంపి దేశానికి అద్భుతమైన సేవ చేసిన గొప్ప విద్యావేత్త ఆయన అని కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: KTR Warns Congress: బీఆర్ఎస్ కార్యకర్త ఇంటిముందు కేటీఆర్ ప్రెస్‌మీట్.. జూబ్లీహిల్స్ ఓటమిపై సంచలన వ్యాఖ్యలు

Just In

01

Collector Rahul Sharma: మినీ మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. కలెక్టర్ రాహుల్ శర్మ!

Hyderabad Crime: క్షణికావేశం..బంధాన్ని తుంచేసింది..పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు.. నాచారంలో దారుణ ఘటన!

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..

Dragon Movie: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. వరుసగా రెండోసారి..

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!