Mahesh Kumar Goud: కాంగ్రెస్ ఎప్పుడూ హింసను స్వాగతించదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫేక్ ఎన్‌కౌంటర్లను కాంగ్రెస్ ఖండిస్తుందని పేర్కొన్నారు. మావోయిస్టుల నాయకులైన హిడ్మా, కేశంవర్వి, గణపతి వంటి వారిని తమ పార్టీ నాయకుల్లా గౌరవిస్తామన్నారు. సామాన్యుల కోసం వారు తమ జీవితాలను త్యాగం చేశారని పేర్కొంటూనే, తాము ఇరువైపుల హింసను వ్యతిరేకిస్తామని నొక్కి చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎలిమినేషన్ ప్రాసెస్ సరైన విధానం కాదని మహేశ్ విమర్శించారు.
Also Read: Mahesh Kumar Goud: ఏ క్షణమైన డీసీసీల ప్రకటన వెలువడే ఛాన్స్ : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నక్సలైట్లపై ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహి ముద్ర
తాను కూడా నక్సలైట్ బాధితుడినే అయినప్పటికీ, కాంగ్రెస్ ఎప్పుడూ హింసను సమర్థించదని పునరుద్ఘాటించారు. పైగా, నక్సలైట్లపై ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహి ముద్ర వేయడం దారుణమన్నారు. జన జీవన స్రవంతిలోకి వస్తామని సర్వం కోల్పోయిన వారు చెబుతున్నప్పటికీ, వారిని కక్ష పూరితంగా అంతమొందించడం సరికాదని మండిపడ్డారు. అధికారాన్ని పరమావధిగా పెట్టుకున్న మోదీ, అమిత్ షాలు ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. అటవీ, ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. లాభాలు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేయడం దౌర్భాగ్యం అంటూ పీసీసీ చీఫ్మండిపడ్డారు.
Also Read: Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ విజయం ఖాయం.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
