Danam Nagender: దానం నాగేందర్ రాజీనామా?
Danam Nagender( IMAGE CREDIT: TWITTER)
Political News

Danam Nagender: దానం నాగేందర్ రాజీనామా? అనర్హత కంటే ముందే చేసే యోచన!

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నారనే వార్తలు కాంగ్రెస్ పార్టీలో ఊపందుకున్నాయి. స్పీకర్ నుంచి అనర్హత వేటు పడకముందే ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేగాక ఆయన ఢిల్లీకి వెళ్లి తన రాజీనామపై ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దానం నాగేందర్ హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లడం రాజీనామా ఎపిసోడ్ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

అనర్హత వేటు పడే అవకాశం

తనపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నదని బలంగా భావిస్తున్న దానం నాగేందర్, అంతకంటే ముందే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఒకవేళ రాజీనామా చేస్తే, తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ హామీ లభిస్తేనే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నదని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అంశంపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయన సన్నిహితులు పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం చేయడం గమనార్హం.

Also Read: MLA Danam Nagender: దానం వ్యాఖ్యల వెనక మతలబు ఏమిటీ?.. వెనక్కి వెళ్తారా?.. కాంగ్రెస్ లోనే కొనసాగుతారా?

పూర్తిగా ఎవిడెన్స్?

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలు జంప్ అయినప్పటికీ, దానం నాగేందర్ అంశం లో స్పష్టంగా ఎవిడెన్స్ లభిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ బీ ఫామ్ పై ఖైరతాబాద్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పవర్ లోకి రాగానే ఆ పార్టీలో చేరారు. అక్కడితో ఆగకుండా ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ బీ ఫామ్ పై పోటీ చేశారు. అయితే బీఆర్ ఎస్ లో రాజీనామా చేయకుండానే ఈ నిర్ణయం తీసుకోవడం చిక్కుల్లో పడ్డారు. ఇది పార్టీ ఫిరాయింపు చట్టం కింద వర్తిస్తుందని బీఆర్ ఎస్ పార్టీ కోర్టు మెట్లు ఎక్కింది. పక్కా ఆధారాలు ఉన్న నేపథ్​యంలో అనర్హవ వేటు తప్పక పడుతుందని లీగల్ టీమ్స్ కూడా దానంకు వివరించాయి. దీంతోనే ఆయన రాజీనామా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.

మిగతా ఎమ్మెల్యేల పరిస్థితీ ఆయోమయమే?

బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ కు పది మంది ఎమ్మెల్యేలు చేరినప్పటికీ, టెక్నికల్ గా తాము బీఆర్ ఎస్ లోనే ఉన్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయా ఎమ్మెల్యేల్లో ఉన్నది. లోకల్ కేడర్, ప్రతిపక్షాల విమర్​శలకూ ఆయా ఎమ్మెల్యేలు స్పష్టమైన సమాధానం చెప్పలేని సిచ్వేషన్ లోకి నెట్టివేయబడ్డారు. అంతేగాక ఫిరాయింపుల చట్టాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీం కోర్టు పరిగణిస్తున్న నేపథ్​యంలో మిగతా ఎమ్మెల్యేలూ ఆందోళన చెందుతున్నారు. ఖైరతాబాద్ తో పాటు స్టేషన్ ఘన్ పూర్ కూ తొలి విడత ఉప ఎన్నికలు నిర్వహించాలని టీపీసీసీ కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దానం నాగేందర్ అంశం పై ఏఐసీసీ నుంచి క్లియరెన్స్ లభించగానే మిగతా ఎమ్మెల్యేలూ ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం.

Also ReadGaddam Prasad Kumar: నేడో రేపో ఎమ్మెల్యేల ఫిరాయింపుల విచారణ..!

Just In

01

Chamal Kiran Kumar Reddy: ట్రిపుల్ఆర్ మూసీ రీజువెనేషన్ కు కేంద్రం సహకరించాలి : ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి

Srinivas Goud: బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేదు : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Balakrishna: బోయపాటి నోటి వెంట చిరు, ప్రభాస్ పేరు.. హర్టయిన బాలయ్య!

Tollywood: రషా తడానీ, హర్షాలి.. నెక్ట్స్ టాలీవుడ్‌ను ఊపేసే భామలు వీరేనా?

Sahakutumbanam: తన ఫ్రెండ్ చనిపోతే.. ఆసక్తికర విషయం చెప్పిన బుచ్చిబాబు సానా!