KTR – High Court: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ఓ కేసు విషయంలో ఊరట దక్కింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు నమోదవ్వగా, ఆ కేసు ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు గురువారం (KTR – High Court) కొట్టివేసింది. దీంతో, ఇదే కేసులో ఉన్న జానపద గేయ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు (Goreti Venkanna) కూడా హైకోర్టు తీర్పుతో ఉపశమనం కలిగింది. వీరిద్దరిపైనా 2023లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.
Read Also- Gadwal Town Fraud: ఐడెంటీ లేని వ్యక్తి.. ఏకంగా రూ.60 లక్షలు దోచేశాడు.. వీడు మామూలోడు కాదు!
కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల జ్యోతి వద్ద గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, అనుమతి లేకుండా డ్రోన్‌ను కూడా ఎగురవేశారంటూ ఎఫ్ఐఆర్‌లో ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలపై ఈ ఇంటర్వ్యూ కొనసాగిందని, బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చే విధంగా ఇంటర్వ్యూ ఉందని పేర్కొన్నారు. అయితే, రాజకీయ లబ్ధి కోసమే ఈ కేసు నమోదు చేశారంటూ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. కేటీఆర్ వాదనలను ఆయన తరపున న్యాయవాది వినిపించారు. ఇరువైపుల వాదనలు న్యాయస్థానం చివరికి కేటీఆర్, గోరెటి వెంకన్నపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది.
Read Also- Delhi blast Umar: ఢిల్లీ పేలుళ్ల కేసు నిందితుడు.. హాస్పిటల్‌లో మహిళా పేషెంట్లను ఏం అడిగేవాడో తెలుసా?
ఎన్నికల సమయంలో జరిగింది ఇదే
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు, ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ స్థలం, లేదా స్మారక చిహ్నం వద్ద ప్రచారం నిర్వహించడం, రాజకీయ ప్రయోజనం కోసం ఇంటర్వ్యూ నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నవంబర్ 2023లో ఈసీకి ఫిర్యాదు అందించారు. ఈ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది. అమరుల స్మారకం వద్ద ఇంటర్వ్యూ చేయడానికి అనుమతి ఎలా ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ డీజీపీకి లేఖ రాసింది. ఇంటర్వ్యూకి అనుమతి, సమయం, హాజరైన వ్యక్తులు వంటి పూర్తి వివరాలను అందించాలని ఎన్నికల అధికారి ఆదేశించారు. డీజీపీ ఇచ్చిన వివరణ ఆధారంగా ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలు తీసుకుంది. బహిరంగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కేటీఆర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశాు.
