Nara Bhuvaneshwari: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) భార్య, ఎన్టీఆర్ భవన్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం (Kuppam Tour)లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు కుప్పంలో విస్తృతంగా ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ఎన్నో బెదిరింపులు వచ్చాయని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా కొందరు బెదిరిస్తున్నారని ఆమె అన్నారు.
‘ప్రజల కోసమే పనిచేస్తున్నాం’
కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి మాట్లాడారు. ‘మా కుటుంబాన్ని ఇప్పటికీ కొందరు బెదిరిస్తున్నారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తున్నాం. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజలంతా మా కుటుంబ సభ్యుల్లా స్పందించారు’ అని భువనేశ్వరి అన్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీకి విపత్కర పరిస్థితులు ఎదురైన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో చంద్రబాబును 40 రోజులపైగా జైలులో ఉంచారు. ఈ క్రమంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది.
నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
మా కుటుంబాన్ని ఇప్పటికీ కొందరు బెదిరిస్తున్నారు
ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తున్నాం
చంద్రబాబు అరెస్ట్ సమయంలో ప్రజలంతా మా కుటుంబ సభ్యుల్లా స్పందించారు
– నారా భువనేశ్వరి pic.twitter.com/BCt3XVdznH
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2025
జలహారతి కార్యక్రమంలో..
కుప్పం నియోజకవర్గంలోని డీకేపల్లిలో జరిగిన జలహారతి కార్యక్రమంలోనూ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నీరు కుప్పానికి చేరుకోవడంతో ప్రజల్లో ఆనందం వారి కన్నుల్లో స్పష్టంగా కనిపించింది. త్రాగు నీరు – సాగు నీరు రెండూ అందుబాటులోకి రావడంతో కుప్పం ప్రజలు వ్యక్తం చేసిన ఆనందం హృదయాన్ని హత్తుకుంది. హంద్రినీవా ప్రాజెక్ట్‌ను కుప్పానికి తీసుకు రావడం ద్వారా సీఎం చంద్రబాబు ఇక్కడి ప్రజలకు దేవుడయ్యారు. కుప్పం ప్రజలు మా మీద చూపుతున్న ప్రేమ, ఆప్యాయత ఎన్నటికీ మరువలేనివి. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు.
డీకేపల్లిలో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొనడం ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నీరు కుప్పానికి చేరుకోవడంతో ప్రజల్లో ఆనందం వారి కన్నుల్లో స్పష్టంగా కనిపించింది.
“త్రాగు నీరు – సాగు నీరు” రెండూ అందుబాటులోకి రావడంతో కుప్పం ప్రజలు వ్యక్తం చేసిన ఆనందం… pic.twitter.com/3dyiKvH1h0
— Nara Bhuvaneswari (@ManagingTrustee) November 20, 2025
విద్యార్థులతో కలిసి భోజనం
కుప్పం పర్యటనలో భాగంగా పరమసముద్రంలోని KGBV పాఠశాలను నారా భువనేశ్వరి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు. విద్యార్థులతో తనకు ఎదురైన అనుభవాలను తెలియజేస్తూ ఎక్స్ లో భువనేశ్వరి పోస్ట్ పెట్టారు. ‘విద్యార్థులతో సమావేశం కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పిల్లల్లో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం, నేర్చుకునే తపన ఎంతో అభినందనీయం. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ విద్యార్థి అయినా ఉన్నత స్థాయికి చేరగలడని వారికి సూచించాను. రాష్ట్ర స్థాయిలో యోగాలో అవార్డు సాధించిన తేజస్వినిని అభినందించాను. విద్యార్థులతో కలిసి భోజనం చేయడం, వారి రోజు వారీ అనుభవాలు వినడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచింది’ అంటూ భువనేశ్వరి ఎక్స్ లో రాసుకొచ్చారు.
కుప్పం పర్యటనలో భాగంగా పరమసముద్రం KGBV పాఠశాల విద్యార్థులతో సమావేశం కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పిల్లల్లో దాగిఉన్న ఆత్మవిశ్వాసం, నేర్చుకునే తపన ఎంతో అభినందనీయం.
పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ విద్యార్థి అయినా ఉన్నత స్థాయికి చేరగలడని వారికి సూచించాను.
క్రీడల్లో రాణించే పిల్లలకు… pic.twitter.com/yzGN5uF7SB— Nara Bhuvaneswari (@ManagingTrustee) November 20, 2025
