Visakhapatnam: అమానుషం.. కాలువలో పుట్టిన బిడ్డ శరీర భాగాలు
Visakhapatnam (Image Source: Freepic)
ఆంధ్రప్రదేశ్, క్రైమ్

Visakhapatnam: విశాఖలో అమానుషం.. కాలువలో పుట్టిన బిడ్డ శరీర భాగాలు.. తల మాత్రం మిస్సింగ్..!

Visakhapatnam: మనుషుల్లో మానవత్వం అడుగంటుతోంది. కొందరు మనుషులు.. మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా దారుణంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా విశాఖలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా పసికందును ముక్కలు ముక్కలుగా నరికి కాలువలో పడేయడం.. ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే..

విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుది. తాడిచెట్ల పాలెం నుంచి కంచరపాలెం వెళ్లే సర్వీసు రోడ్డు పక్కన ఉన్న కాలువ లేదా కల్వర్టులో ఓ పసికందు శరీర భాగాలు కనిపించాయి. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలను కాలువలో చూసి స్థానిక సంజీవయ్య కాలనీ వాసులు ఒక్కసారిగా హడలిపోయారు. అయితే తొలుత బొమ్మకు సంబంధించిన భాగాలను అంతా భావించారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. అవి నిజమైనని తెలిసి వణికిపోయారు.

హత్య చేసి పడేశారా?

కాలువలో పసికందు శరీర భాగాలు చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని చూసి ఇది ముమ్మాటికి హత్యేనని స్థానికులు చెబుతున్నారు. చిన్నారిని ఎక్కడో చంపేసి.. శరీర భాగాలను ఇక్కడ పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే చిన్నారికి సంబంధించిన కాళ్లు, చేతులు, ఇతర అవయవాలు లభించినప్పటికీ.. తల మాత్రం ఎక్కడా కనిపించలేదు. కాలువతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించినప్పటికీ తల జాడ కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు.

Also Read: Bihar CM Oath Ceremony: బిహార్‌లో సరికొత్త రికార్డు.. పదోసారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం.. హాజరైన ప్రధాని, చంద్రబాబు

రంగంలోకి పోలీసులు..

కాలువలో పసికందు శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు చిన్నారి శరీర భాగాల నుంచి శాంపిల్స్ ను ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది. అనంతరం దానిని ల్యాబ్ కు పంపించింది. పసికందు అవయవాలను విశాఖ కేజీహెచ్ కు పోలీసులు తరలించారు. ఈ బిడ్డ ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆశ వర్కర్స్ వద్ద ఉన్న గర్భిణీల వివరాలను సేకరిస్తున్నారు. పసికందు మరణానికి కారణమైన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Jagan – Nampally Court: నాంపల్లి కోర్టుకు జగన్.. భారీగా తరలొచ్చిన వైసీపీ శ్రేణులు.. రప్ప రప్ప పోస్టర్ల ప్రదర్శన

Just In

01

Supreme Court: ఆ లోపు ముగ్గురు ఎమ్మెల్యేలను విచారించండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్‌కు సుప్రీం డెడ్‌లైన్!

Bandla Ganesh: సుద్దపూస.. బండ్ల న్యూ అవతార్ చూశారా? డీజే కొట్టు మామా!

Naga Vamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది..

Harsha Vardhan: వస్త్రధారణ అనేది స్వేచ్ఛలో ఒక అంశం మాత్రమే.. శివాజీ, అనసూయ కాంట్రవర్సీలోకి హర్ష!

IMDB 2026: ఐఎండిబి 2026లో మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ ఇదే..