Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. కల్వకుంట్ల కవితతో పాటు జాగృతి నేతలు, కార్యకర్తలు తరలిరావడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో సింగరేణి భవన్ ముందు బైఠాయించిన కవిత.. ఇండిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే పునరుద్ధరించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే కవితను వెళ్లిపోవాలని పోలీసులు చెప్పినప్పటికీ అక్కడే కూర్చోవడంతో కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. పోలీసులకు, జాగృతి నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. కవితను సైతం పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ సంస్థ కార్మికులపై మాట్లాడడం లేదని విమర్శించారు. సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం వేలం పాటతో సంబంధం లేకుండా బొగ్గు బ్లాకులు కేటాయించాలని, ఏడాదికి 5 నూతన భూగర్భ గనులు తెరిచి, పరుగు పందెంతో నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేట్ వారితో కాకుండా కంపెనీ కార్మికులతో నడిపించాలని, అందులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను, జెన్ కో, ట్రాన్స్ కో మారిదిరిగా రెగ్యూలర్ చేయాలని కోరారు.
Also Read: Nashik Bus Station: బస్టాండ్‌లో ఘోరం.. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు.. వీడియో వైరల్
సింగరేణి కార్మికులకు పాత వీఆర్ఎస్ స్కీంను పునరుద్ధరించాలని రెండేళ్ల సర్వీస్ ఉన్న కార్మికులకుందరిని అన్ ఫిట్ చేసి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కవిత అన్నారు. సింగరేణి హౌజింగ్ బోర్డు సొసైటీ ఏర్పాటు చేసి స్వంత ఇంటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేనిలో భూ నిర్వాసితులకు, కాంట్రాక్టు కార్మికులకు వెంటనే శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అదే విధంగా సంస్థలో అవినీతి నిర్మూలనకు, రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు.
