Bigg Boss Telugu 9 (Image Source: Youtube)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: హౌస్‌మేట్స్‌ని ఏడిపిస్తున్న బిగ్ బాస్.. రీతూపై పవన్ ఫ్యామిలీ ప్రేమ చూశారా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 73వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 73) కూడా ఫ్యామిలీ టైమ్ నడుస్తోంది. ఈ వీక్ అంతా ఎమోషనల్ టచ్ ఇస్తూ.. బిగ్ బాస్ అందరి గుండెలను పిండేయాలని ఫిక్స్ అయినట్లుగా అర్థమవుతోంది. ఇప్పటికే కొందరు ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి వచ్చి, అందరినీ ఏడిపించేశారు. ఈ బుధవారం కూడా అదే కంటిన్యూ అవుతున్నట్లుగా తాజాగా వచ్చిన ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. బుధవారం హౌస్‌లో డిమోన్ పవన్ ఫ్యామిలీ (Demon Pavan Family), సంజన ఫ్యామిలీ (Sanjjanaa Galrani Family) సందడి చేసినట్లుగా ప్రోమోస్ తెలియజేస్తున్నాయి. మరీ ముఖ్యంగా డిమోన్ పవన్, వాళ్ల అమ్మని చూసి ఉద్వేగానికి లోనయ్యాడు. వారి బాండింగ్ చూసి హౌస్ అంతా వారి ఫ్యామిలీలను గుర్తు చేసుకుని కంటతడి పెడుతున్నారు. బుధవారం ఎపిసోడ్‌కు సంబంధించి వచ్చిన ప్రోమోస్‌లో అసలేముందంటే..

Also Read- Manchu Lakshmi: ఆ పని చేయకపోతే మహేష్, నమ్రతలను కొడతా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్

రీతూకి పవన్ మదర్ హగ్..

‘హౌస్‌లో ఉన్న వారందరూ ఫ్రీజ్’.. అంటూ ఫ్యామిలీ టైమ్ పేరుతో వచ్చిన ప్రోమోలో బిగ్ బాస్ ఆర్డర్ వేశారు. దీంతో ఎవరో ఇంట్లోకి వస్తున్నారని అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. కానీ ఎవరూ రాలేదు. కాసేపు ఇంటి సభ్యులతో బిగ్ బాస్ ఆడేసుకున్నారు. లేడీస్‌ని కాసేపు, జంట్స్‌ని కాసేపు ఫ్రీజ్ చేస్తూ.. వారి ముఖాలకు ఇష్టం వచ్చినట్లుగా పెయింటింగ్స్ వేస్తూ కామెడీ జనరేట్ చేస్తున్నారు. అందరూ రిలీజ్ అని బిగ్ బాస్ చెప్పిన తర్వాత జంట్స్‌ని కొట్టేందుకు లేడీస్ వెంటపడుతున్నారు. ఆ వెంటనే చింటూ చింటూ అంటూ డిమోన్ పవన్ వాళ్ల మదర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె చేసుకుని వచ్చిన డ్రై ఫ్రూట్ సున్నండలను పవన్, రీతూలకు ప్రత్యేకంగా ఆమె తినిపిస్తున్నారు. హౌస్‌మేట్స్ అందరికీ వాటిని పంచారు. పవన్ వాళ్ల అమ్మను కాకా పట్టేందుకు రీతూ తెగ ట్రై చేస్తుంది. ఆమె కూడా రీతూపై ప్రత్యేక ప్రేమను కనబరుస్తుంది. చూస్తుంటే రీతూ, పవన్‌ల బాండింగ్‌ను వారి ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసినట్లుగానే అర్థమవుతోంది. పవన్ పెళ్లికి మమ్మల్ని పిలవండి అని ఇమ్ము చెబుతున్నాడు. ఎప్పుడు పెళ్లి అని అందరూ ఆమెను అడుగుతున్నారు. పవన్‌కు లేడీ ఫ్యాన్స్ ఎక్కువని ఆమె చెబుతున్నారు. పవన్‌తో ఆమె బాండింగ్ చూసి అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఫైనల్‌గా రీతూని ఆమె హగ్ చేసుకోవడం చూస్తుంటే.. అనేకానేక అనుమానాలు రావడం పక్కా.

Also Read- Nayanthara Gift: నయనతార పుట్టినరోజుకు విఘ్నేష్ ఇచ్చిన గిఫ్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?.. వర్తు మామా వర్తు..

సంజన చేసేది 10 శాతమే..

‘సంజన ఫ్యామిలీ’ అంటూ వచ్చిన రెండో ప్రోమోలో.. ‘సంజన ఫ్రీజ్’ అని బిగ్ బాస్ చెప్పగానే.. హౌస్‌లోకి సంజన భర్త, పిల్లలు ఎంట్రీ ఇచ్చారు. ఆ పిల్లలతో ఇంటి సభ్యులు ఆడుకుంటున్నారు. సంజన కుమారుడితో ఇమ్ము కామెడీ చేస్తున్నాడు. ‘మీ అమ్మను పంపించేసి.. నువ్వు ఉండిపోరా. మీ అమ్మ అందరితో గొడవలు పడుతుందిరా తమ్ముడా.. ఏం చెప్పలేకపోతున్నా. నువ్వన్నా చెప్పు వెళ్లేటప్పుడు.. ఓకేనా’ అని ఇమ్ము అనగానే.. ‘ఓకే’ అని పిల్లాడు అంటున్నాడు. నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని సంజన, తన భర్తని అడుగుతుండగా, అంతా బాగానే ఉందని ఆయన చెబుతున్నారు. ఇంట్లో చేసే గొడవలతో పోలిస్తే.. 10 శాతం మాత్రమే ఇక్కడ పడుతుందని, సంజన భర్త ఇమ్ముకి చెబుతున్నాడు. వామ్మో.. టెన్ పర్సంట్‌కే హౌస్‌లో ఆటాడేసుకుంటున్నావని సంజనని ఉద్దేశిస్తూ ఇమ్ము అంటున్నాడు. తర్వాత కెప్టెన్సీ బోర్డు చూపించి అమ్మ ఎక్కడుంది? అని అడగగా, సంజన కుమారుడు గుర్తు పట్టి ఆ ఫొటోకి ముద్దిచ్చాడు. ఇలా సంజన చాలా హ్యాపీగా ఉండగా.. ఫ్యామిలీస్ రాని ఇంటి సభ్యులు బాధపడుతూ.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

iBomma Ravi: ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. నాంపల్లి కోర్టు కీలక ఉత్తర్వులు

Bandi Sanjay: హిందుత్వమే నా శ్వాస.. రాష్ట్రంలో రామరాజ్యం తెస్తాం.. బండి సంజయ్

Shah Rukh Khan: ‘కింగ్ ఖాన్’ చదువులోనూ బ్రిలియంటే.. సోషల్ మీడియాలో షారుఖ్ మార్క్ షీట్ వైరల్!

Telangana Weather: చలితో అల్లాడుతున్న ప్రజలకు గుడ్ న్యూస్.. వాతావరణ శాఖ తీపి కబురు!

Chikoti Praveen: నీ పతనం ఖాయం.. రాజమౌళిపై చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు