– ఢిల్లీలో తెలంగాణ భవన్ కోసం అడుగులు
– త్వరలో టెండర్లు పిలుస్తామన్న కోమటిరెడ్డి
– కేంద్ర పర్మిషన్ కోసం వెయిటింగ్
Minister Komatireddy: విభజన adచట్టంలో మిగిలిపోయిన సమస్యలు సాధిస్తామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కీలక విషయాలపై స్పందించారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదన్న ఆయన, ఛార్జ్ తీసుకున్న మూడో రోజే తాను తెలంగాణ భవన్‌ను పరిశీలించానని తెలిపారు.
ఢిల్లీలోని ఆంధ్ర భవన్ విభజనపై స్పష్టత వచ్చిందన్న ఆయన, హైదారాబాద్ హౌజ్ పక్కన తెలంగాణ భవన్ నిర్మాణం జరగనుందని వివరించారు. ఇప్పటికే కొన్ని మోడల్స్ పరిశిలిస్తున్నామని, త్వరలోనే ఫైనల్ చేస్తామని తెలిపారు. రెండు నెలల్లో డిల్లీలో తెలంగాణ భవన్‌కు టెండర్లు పిలుస్తామని, ఢిల్లీలో భవన నిర్మాణాల అనుమతులకు కొంత సమయం పడుతుందని చెప్పారు. త్వరగా అనుమతులు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నామని, తెలంగాణ ఐకానిక్‌గా ఈ భవన నిర్మాణం ఉంటుందని వివరించారు.