Priyanka remuneration: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆమె తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘వారణాసి’ చిత్రానికి ప్రియాంకా చోప్రా రెమ్యూనరేషన్ ఎంత? ప్రముఖ సినీ వర్గాలు పలు మీడియా నివేదికల సమాచారం ప్రకారం, ‘వారణాసి’ చిత్రంలో ప్రియాంకా చోప్రా తన ‘మందాకిని’ పాత్ర కోసం అడిగిన పారితోషికం అక్షరాలా రూ. 30 కోట్లు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె భారతీయ సినిమాకు తిరిగి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ఆమె అంతర్జాతీయ స్టార్‌డమ్‌కు, గ్లోబల్ అప్పీల్‌కు తగినట్లే ఈ భారీ మొత్తం నిర్ణయించబడినట్లు తెలుస్తోంది. అయతే వెయ్యి కోట్లు సినిమాకు హీరోయిన్ కోసం రూ. 30 కోట్లు ఇవ్వడంలో తప్పులేదంటున్నారు ప్రేక్షకులు.
Read also-Mahesh Babu fitness: మహేష్ బాబులా ఉండాలంటే ఏం చేయాలి.. ఆయన దినచర్య ఇదే..
‘క్వాంటికో’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రియాంక, రాజమౌళి లాంటి దర్శకుడితో కలిసి పనిచేయడానికి తన పారితోషికాన్ని గణనీయంగా పెంచినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. భారతదేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా ప్రియాంక రికార్డు క్రియేట్ చేసింది. ‘వారణాసి’ సినిమా కోసం ప్రియాంకా చోప్రా తీసుకుంటున్న రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ ఆమెను భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా అగ్రస్థానంలో నిలబెట్టింది. ప్రియాంక అంతకుముందు కూడా బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే వారిలో ఉన్నప్పటికీ, ఈ తాజా డిమాండ్‌తో ఆమె ఇతర అగ్ర నటీమణులను అధిగమించినట్లు తెలుస్తోంది.
Read also-Akhanda 2 second single: బాలయ్య బాబు ‘అఖండా 2’ నుంచి మరో సింగిల్.. స్టెప్పులు మామూలుగా లేవుగా..
ప్రస్తుతం భారత దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లు ఎవరంటే.. ఒక సినిమాకు ప్రియాంకా చోప్రా (‘వారణాసి’ కోసం)రూ.30 కోట్లు తీసుకుంటున్నారు. దీపికా పడుకొణె రూ.15 కోట్ల నుండి రూ.30 కోట్ల వరకు తీసుకుంటున్నారు. ఆలియా భట్ అయతే రూ.20 కోట్ల నుండి రూ.25 కోట్ల వరకు ఉంది. ఈ రూ.30 కోట్ల పారితోషికంతో, ప్రియాంకా చోప్రా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెం. 1 స్థానంలో ఉన్న అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా రికార్డు సృష్టించింది. గ్లోబల్ మార్కెట్‌లో ఆమెకున్న ఆకర్షణ, అమెరికన్ ప్రేక్షకులలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్.. ‘వారణాసి’ వంటి మెగా ప్రాజెక్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ కారణంగానే నిర్మాతలు ఈ భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ తో ఎంతటి బజ్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే గ్లోబల్ రేంజ్ లో విడుదలవుతున్న ఈ సినిమాపై అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సినిమా 2027 సమ్మర్ లో విడుదల కానుంది. ఈ సినిమా అయినా కరెక్టు టైముకు విడుదల కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
