mahesh-babu( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Mahesh Babu fitness: మహేష్ బాబులా ఉండాలంటే ఏం చేయాలి.. ఆయన దినచర్య ఇదే..

Mahesh Babu fitness: సూపర్ స్టార్ మహేష్ బాబు వయసు పెరుగుతున్నా, తరగని అందం, ఫిట్‌నెస్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి సినిమాలోనూ మరింత యవ్వనంగా, ఉత్సాహంగా కనిపించడానికి కేవలం నటనే కాదు, కఠినమైన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్య కారణం. ఫిట్‌నెస్‌ను కేవలం సినిమా పాత్రలకు పరిమితం చేయకుండా, దాన్ని తమ జీవితంలో ఒక భాగంగా మార్చుకున్న మహేష్ బాబు అద్భుతమైన డైట్ వర్కౌట్ ప్లాన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Read also-Andhra King Taluka Trailer: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి..

దినచర్య

మహేష్ బాబు ఈ అసాధారణ ఫిట్‌నెస్ వెనుక సుదీర్ఘ కాలంగా ఆయనతో పనిచేస్తున్న శిక్షకుడు కుమార్ మన్నవ కృషి ఉంది. ఫిట్‌నెస్‌ అనేది నిలకడ తో కూడిన ప్రయాణం అని బలంగా నమ్మే మహేష్, షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా తన వర్కౌట్‌ను మాత్రం అస్సలు మానరు. ఆయన వారంలో ఐదు రోజులు జిమ్‌లో కచ్చితంగా గడుపుతారు. ఒక్కో సెషన్ సుమారు 60 నుంచి 90 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సెషన్స్‌లో బలాన్ని పెంచే వ్యాయామాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనితో పాటు, శరీర కదలిక సామర్థ్యం ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరచడానికి యోగా, పైలేట్స్ సమతుల్యమైన కార్డియో (HIIT) శిక్షణను దినచర్యలో భాగంగా చేసుకున్నారు. ప్రతి వర్కౌట్ తర్వాత కండరాలు తిరిగి కోలుకోవడానికి (Recovery) తప్పనిసరిగా స్ట్రెచింగ్ చేయడం ఆయన నియమాలలో ఒకటి.

సమతుల్య ఆహారం

మహేష్ బాబు కఠినమైన లేదా ఫ్యాడ్ డైట్లకు దూరంగా ఉంటారు. ఆయన ఆహారం స్వచ్ఛమైన, సమతుల్య పోషణకు ప్రాధాన్యతనిస్తుంది. రోజులో ఒకేసారి ఎక్కువ తినకుండా, ప్రతి మూడు గంటలకు ఒకసారి చొప్పున సుమారు 5 నుండి 6 సార్లు తక్కువ మొత్తంలో భోజనం చేస్తారు. దీనివల్ల జీవక్రియ స్థిరంగా ఉండి, శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ఆయన డైట్‌లో ప్రొటీన్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి కీలకం. ఉదయం అల్పాహారంలో ఓట్స్, గుడ్లు, తాజా పండ్లు, నట్స్ కలిపిన పౌష్టికాహారాన్ని తీసుకుంటారు. వర్కౌట్ తర్వాత కండరాల రికవరీ కోసం తప్పనిసరిగా ప్రొటీన్ షేక్ తాగుతారు. మధ్యాహ్న భోజనంలో చికెన్, చేప లేదా ల్యాంబ్ వంటి లీన్ మీట్‌తో పాటు బ్రౌన్ రైస్ లేదా క్వినోవా వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఇక రాత్రి భోజనాన్ని చాలా తేలికగా, కొవ్వు పదార్థాలకు దూరంగా తీసుకుంటారు. సాధారణంగా డిన్నర్‌లో గుడ్లు లేదా చికెన్ ముక్కలతో కూడిన హోల్-వీట్ బ్రెడ్‌ను ఎంచుకుంటారు. స్నాక్స్‌గా నట్స్, పండ్లు ఉంటాయి.

Read also-Akhanda 2 second single: బాలయ్య బాబు ‘అఖండా 2’ నుంచి మరో సింగిల్.. స్టెప్పులు మామూలుగా లేవుగా..

అసలు రహస్యం ఏం టంటే..

మహేష్ బాబు అద్భుతమైన ఫిట్‌నెస్ వెనుక దాగి ఉన్న అతిపెద్ద రహస్యం పోర్షన్ కంట్రోల్. తమకు ఇష్టమైన ఇడ్లీ, దోస, పూరీ వంటి ఆహారాలను పూర్తిగా మానేయకుండా, వాటిని మితంగా తీసుకుంటూ, అతిగా తినకుండా జాగ్రత్తపడతారు. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, సమతుల్య ఆహారం మితంగా తినే ఈ సూత్రమే మహేష్ బాబు తరగని యవ్వనానికి, అద్భుతమైన ఫిట్‌నెస్‌కు మూల కారణం. మనకు ఇష్టమైనవారిలాగా మనం కూడా ఉండాలనుంకుంటే మనం కూడా ఈ ఆహార, వ్యాయామ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.

Just In

01

Supreme Court: సుప్రీం తీర్పుపై ఉత్కంఠ.. నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ..!

Puzzle: 30 సెకన్ల ఛాలెంజ్.. ఈ ఫొటోలో ఎన్ని ” Y ” లు ఉన్నాయో చెప్పగలరా? మీ ఐక్యూ టెస్ట్ చేసుకోండి!

BC Reservations: గందరగోళంలో బీసీ లీడర్లు.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా సాధ్యం..?

Konda Madhavi Latha: బ్రదర్ అంటూనే రాజమౌళిపై ఫైర్ అయిన బీజేపీ నాయకురాలు.. మూలాలపై అలాంటి మాటలా..

Tirumala News: తిరుమల భక్తులు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ దేవస్థానం కీలక నిర్ణయాలు..!