rahul gandhi narendra modi shake hand
Politics

LOP Rahul Gandhi: రాహుల్.. మోదీ.. షేక్‌హ్యాండ్

– స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ఉభయుల స్వాగతం
– తొలిసారి ప్రతిపక్ష నేతగా రాహుల్

Shake Hands: పార్లమెంటులో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మొన్నటి ఎన్నికల వరకు ఇరువురు ఘాటుగా విమర్శలు చేసుకున్న ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు కరచాలనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కొత్తగా ఎన్నికైన స్పీకర్ ఓం బిర్లాకు స్వాగతం చెబుతూ ఆయన కూర్చునే స్థానం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మరోసారి అభినందనలు తెలిపి వచ్చారు. మోదీ, రాహుల్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికై భర్తృహరి మెహతాబ్.. మూజువాణి ఓటు నిర్వహించారు. ఓం బిర్లా గెలిచినట్టు ప్రకటించారు. ఆ వెంటనే ప్రధాని మోదీ, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓం బిర్లా కూర్చున్న చోటుకు వెళ్లారు. రాహుల్ గాంధీ కూడా అక్కడికి వచ్చారు. ప్రధాని మోదీ.. ఓం బిర్లాను అభినందించిన తర్వాత రాహుల్ గాంధీకి సైగ చేశారు. దీంతో రాహుల్ కూడా ఓం బిర్లాకు కంగ్రాట్స్ చెప్పి.. ఆ వెంటనే మోదీకి కూడా చేయి అందించారు. ఇద్దరు కరచాలనం చేసుకున్న తర్వాత ఓం బిర్లాతోపాటు స్పీకర్ చైర్ వైపు కదిలారు.

రాజీవ్, సోనియా తర్వాత.. రాహుల్

లోక్ సభలో విపక్ష నేతగా తొలిసారి రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. మొన్నటి వరకు లోక్ సభలో ప్రతిపక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరి కొనసాగారు. తాజా ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. గాంధీ కుటుంబంలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా రాహుల్ నిలిచారు. తండ్రి రాజీవ్ గాంధీ (1989-1990), తల్లి సోనియా గాంధీ (1999-2004)ల తర్వాత రాహుల్ గాంధీ తాజాగా లోక్ సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపడుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండాలని సీడబ్ల్యూసీ కోరినప్పటికీ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని వెల్లడించలేదు. కానీ, మంగళవారం ఖర్గే నివాసంలో ప్రతిపక్ష కూటమి పార్టీల సభ్యులు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా బలపరిచిన తర్వాత ఆయన అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Just In

01

Haryana: సిస్టర్స్ డీప్ ఫేక్ వీడియోలు.. సోదరుడు ఆత్మహత్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Crime News: మామిడి తోటలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 6 గురు అరెస్ట్..!

ACB Rides: ఏసీబీ వలలో గ్రామ పరిపాలన అధికారి.. దేవుడే పట్టించేనా..!

Mass Jathara: మాస్ జాత‌ర ప్రీ రిలీజ్ ఈవెంట్.. రవితేజ కోసం కోలీవుడ్ స్టార్ హీరో..?

Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ