Saudi Bus Accident: సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నారు. అంతేగాకమంత్రి అజారుద్దీన్(Azharuddin), ఎంఐఎం(MIM) ఎమ్మెల్యే, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపారు. చనిపోయిన వారి మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధిత కుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. బస్సు ప్రమాదంపై సీఎం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే.. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీ(DGP) ని ఆదేశించారు. తెలంగాణ కు చెందిన వారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు.
మన రాష్ట్రానికి చెందిన వారు
కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని అదేశించారు. సీఎం అదేశాలతో సీఎస్ రామకృష్ణారావు(CS Ramakrishna Rao) ఢిల్లీ లో ఉన్న కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్‌ను అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు. దీంతో పాటు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్‌లోని డిప్యూటీ అంబాసిడర్‌తో స్టేట్ ఆఫీసర్లు మాట్లాడారు. మన రాష్ట్రానికి చెందిన యాత్రికులు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎంత మంది ఉన్నారనే పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీని సర్కార్ ఆదేశించింది.
Also Read: Medchal Municipality: ఆ మున్సిపల్‌లో ఏం జరుగుతుంది.. మున్సిపల్ కమిషనర్ ఉన్నట్లా? లేనట్లా..?
తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తున్న తెలంగాణ(Telangana) యాత్రికులు కొందరు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషాదకరమైన బస్సు ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచనల మేరకు.. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, తెలంగాణ నుంచి ఎంత మంది వ్యక్తులు ఉన్నారో నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్లు..
వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్- +91 98719 99044
సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- +91 99583 22143.
రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్- +91 96437 23157.
Also Read: Hyderabad Crime: రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఇంటికి కన్నం.. తాళ్లతో కట్టేసి కర్రలతో దాడి
