Balayya and CV Anand (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

NBK: బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ మాజీ సీపీ సీవీ ఆనంద్.. ముగిసిన వివాదం.. అసలేం జరిగిందంటే?

NBK: సినీ ఇండస్ట్రీలో పైరసీ, డిజిటల్ లీకేజీ, బెట్టింగ్ యాప్‌ల సమస్యలపై ఇటీవల హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ (అప్పుడు మాజీ కాదు) సీవీ ఆనంద్ (CV Anand) సినీ ప్రముఖులతో నిర్వహించిన సమావేశం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు పెద్ద దుమారాన్ని రేపాయి. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అభిమానులు, మాజీ సీపీ సీవీ ఆనంద్‌ల మధ్య జరిగిన ఈ సోషల్ మీడియా వార్ చివరకు సామరస్యంగా ముగిసింది. దీనిపై సీవీ ఆనంద్ ఎప్పుడో బాలకృష్ణకు క్షమాపణలు చెప్పానని, బిజీగా ఉండటంతో ఆ విషయం చెప్పలేకపోయానని తాజాగా తెలిపారు. వార్ మొదలైన సమయంలోనే, నేను వెంటనే ఆయనకు క్షమాపణలు చెబుతూ మెసేజ్ చేశానని, ఆ పోస్ట్ కూడా డిలీట్ చేశానని సీవీ ఆనంద్ తెలిపారు.

Also Read- VC Sajjanar: కరేబియన్ పౌరసత్వo.. 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా.. 21వేల సినిమాలు.. ఐబొమ్మ రవి చిట్టా ఇదే!

అసలు వివాదం ఎలా మొదలైందంటే..

ఇటీవల సీవీ ఆనంద్.. అగ్ర హీరోలైన చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), వెంకటేష్‌ (Venkatesh)తో పాటు పలువురు యువ హీరోలు, నిర్మాతలతో ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీటింగ్‌కు అగ్ర హీరో అయిన బాలకృష్ణ హాజరుకాకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ సందర్భంలో, ఓ నెటిజన్ నేరుగా మాజీ సీపీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేస్తూ, ‘బాలకృష్ణను ఎందుకు పిలవలేదు?’ అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా సీవీ ఆనంద్ పంపిన ఓ ఎమోజీ (ముఖ్యంగా నవ్వుతున్న లేదా సెటైరికల్‌గా అనిపించే ఎమోజీ) అపార్థాలకు దారి తీసింది. ఆ ఎమోజీ బాలకృష్ణ అభిమానుల మనోభావాలను దెబ్బతీసిందనే భావనతో సోషల్ మీడియాలో ‘ఫ్యాన్ వార్’ మొదలైంది. బాలకృష్ణ ఫ్యాన్స్ (NBK Fans) పెద్ద ఎత్తున తమ ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ అంశం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read- Bigg Boss Telugu 9: కుండలు బద్దలవుతున్నాయ్.. రీతూ వర్సెస్ డిమోన్.. అసలైన ఆట మొదలైంది..

మాజీ సీపీ క్షమాపణ, వివరణ

వివాదం తీవ్రమవుతున్న విషయాన్ని గ్రహించిన మాజీ సీపీ సీవీ ఆనంద్ వెంటనే దీనిపై వివరణ ఇచ్చారు. బాలకృష్ణ అభిమానుల అభ్యంతరాన్ని తెలుసుకున్న తర్వాత, ఆలస్యం చేయకుండా తాను బాలకృష్ణకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతూ మెసేజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ‘నేను టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు చూస్తూ, వారిని అభిమానిస్తూ పెరిగిన వాడిని. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ వంటి పెద్ద హీరోలందరితో నాకు మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి’ అని సీవీ ఆనంద్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ ఎమోజీని ఉద్దేశపూర్వకంగా పోస్ట్ చేయలేదని, కేవలం అపార్థం చేసుకున్నారని ఆయన వివరించారు. ఈ వివరణతో పాటు, సమస్యను మరింత పెంచకుండా ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆయన బహిరంగంగా కోరారు. సీవీ ఆనంద్ ఇచ్చిన ఈ వివరణ, క్షమాపణ తర్వాత, బాలకృష్ణ అభిమానులు కూడా శాంతించారు. దీంతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నడిచిన ఈ ‘NBK ఫ్యాన్స్ వర్సెస్ మాజీ సీపీ’ వివాదం తెరపడింది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

AB4: జయ కృష్ణ ఘట్టమనేని సరసన ఆ భామే.. అధికారిక ప్రకటన వచ్చేసింది

Varanasi: తప్పిదం మానవుడిది.. నింద దేవుడిపై.. ఏంటిది రాజమౌళి?

NBK: బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ మాజీ సీపీ సీవీ ఆనంద్.. ముగిసిన వివాదం.. అసలేం జరిగిందంటే?

Premante Trailer: ‘సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు’.. హిలేరియస్!

Tortoise: రాజ్ తరుణ్ మరో ప్రయోగం.. ఈసారి ‘టార్టాయిస్’గా..!