Premante Trailer: ప్రియదర్శి సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ.. రేసులో దూసుకెళుతున్నారు. స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూనే.. హీరోగానూ ఆయన బిజీగా మారిపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రియదర్శి (Priyadarshi) సరసన ఆనంది (Anandhi) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సుమ కనకాల (Suma Kanakala) ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మిస్తుండగా, రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది.
Also Read- Bigg Boss Telugu 9: కుండలు బద్దలవుతున్నాయ్.. రీతూ వర్సెస్ డిమోన్.. అసలైన ఆట మొదలైంది..
ఫన్ రోలర్ కోస్టర్ రైడ్
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోగా, సోమవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ (Premante Trailer)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ హిలేరియస్‌గా ఉండటమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. అదే టైమ్‌లో నవ్వులను కూడా పూయిస్తుంది. కొత్తగా పెళ్ళయిన జంట జీవితంలో ఉండే ప్రేమ, ఆప్యాయత, గొడవలు, సరదాలు, సంతోషాల మిక్స్‌గా వచ్చిన ఈ ట్రైలర్.. ఈ సినిమా ఫన్ రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుందని తెలియజేస్తోంది. ప్రియదర్శి నేచురల్, హ్యుమరస్ నటనతో ఆకట్టుకోవడమే కాకుండా, చాలా ఫ్యామిలీలు ఫేస్ చేస్తున్న బాధని నవ్వుతూనే పరిచయం చేశారు. ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి సిట్యువేషన్, సన్నివేశం ఎంటర్‌టైనింగ్‌గా దర్శకుడు మలిచిన తీరు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.
సారం లేని సంసారం వద్దు
ఇక కానిస్టేబుల్ క్యారెక్టర్‌లో సుమ కనకాల తన సిగ్నేచర్ మార్క్‌తో నవ్వుల పువ్వులు పూయిస్తున్నారు. ప్రియదర్శి, ఆనందిలకు విడాకులు ఇప్పించడానికి ఆమె పడే పాట్లు ఎంటర్‌టైనింగా ఉన్నాయి. ఈ సినిమా తర్వాత సుమ నటిగా బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రైలర్ చివర్లో ‘సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు’ అని సుమ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా అని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ ఫన్, ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేస్తూ అందరికీ కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో వస్తున్నట్లుగా అయితే ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి లైవ్లీ విజువల్స్, లియాన్ జేమ్స్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ ఫన్‌ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి. ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
