Akhanda 2 Thaandavam New still (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Akhanda 2 Thaandavam: సెకండ్ సింగిల్ ‘జాజికాయ’ వస్తోంది.. ఎప్పుడంటే?

Akhanda 2 Thaandavam: మరీ వైలెంట్‌గా ఉన్నాడు.. కాస్త పువ్వుల్ని, అమ్మాయిల్ని చూపించడ్రా.. డైలాగ్ గుర్తుందా? ఇప్పుడిదే ఫాలో అవుతున్నారు ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2 Thaandavam) టీమ్. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన గూస్‌బంప్స్ తెప్పించే కంటెంట్‌తో సినిమాపై అమాంతం అంచనాలు పెంచేసిన టీమ్.. ఇప్పుడు రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ‘జాజికాయ’ అంటూ సాగే సెకండ్ సింగిల్‌ రిలీజ్ అప్డేట్‌ను తాజాగా మేకర్స్ వదిలారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapatri Srinu) పవర్ ఫుల్ కొలాబరేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్, ఫస్ట్ సింగిల్ తాండవం అద్భుతమైన స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే.

Also Read- Pawan Kalyan: పైరసీ ముఠా సూత్రధారి ఇమ్మడి రవి అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందనిదే!

‘జాజికాయ’ సాంగ్ వచ్చేది ఎప్పుడంటే..

డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రమోషన్స్‌పై మేకర్స్ దృష్టి పెట్టారు. మొన్నటి వరకు ప్రమోషన్స్ చేయడం లేదంటూ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. ఫస్ట్ సింగిల్ ‘తాండవం’ పాటను వదిలిన వెంటనే ఇప్పుడు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ‘అఖండ 2’ సెకండ్ సింగిల్ ‘జాజికాయ జాజికాయ’ (Jajikaya Jajikaya Song) రాబోతుందని తెలుపుతూ మేకర్స్ వదిలిన పోస్టర్.. సినిమాలోని రెండవ కోణాన్ని పరిచయం చేస్తోంది. ఈ పాటను నవంబర్ 18న గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ఈ సాంగ్ అదిరిపోయే డ్యాన్స్ నెంబర్‌గా ఉండబోతోందని, సంగీత దర్శకుడు థమన్.. థియేటర్స్ దద్దరిల్లే పాటని కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read- The Girlfriend Collections: బాక్సాఫీస్ వద్ద రష్మిక మూవీ కొత్త రికార్డ్ .. ది గర్ల్‌ఫ్రెండ్ 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

వైజాగ్ జగదాంబ థియేటర్‌లో..

గ్రాండ్ సెట్‌లో షూట్ చేసిన ఈ సాంగ్‌లో బాలకృష్ణ, సంయుక్తల మాస్ డ్యాన్స్ మూమెంట్స్ ఫ్యాన్స్‌ని అద్భుతంగా అలరిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బాలయ్య ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది. వైజాగ్ జగదాంబ థియేటర్‌లో గ్రాండ్‌‌గా జరగనున్న ఈ సాంగ్ లాంచ్ వేడుకకు నటసింహం బాలకృష్ణ‌తో పాటు చిత్ర యూనిట్ హాజరవుతుందని తెలుస్తోంది. 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. కచ్చితంగా పాన్ ఇండియా సెన్సేషన్‌గా ఈ సినిమా ఉంటుందని వారంతా భావిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Premante Trailer: ‘సారం లేని సంసారం వద్దు.. విడాకులే ముద్దు’.. హిలేరియస్!

Tortoise: రాజ్ తరుణ్ మరో ప్రయోగం.. ఈసారి ‘టార్టాయిస్’గా..!

Delhi Blast Case: ఢిల్లీ బ్లాస్ట్‌ కేసులో దొరికిన సహకుట్రదారుడు.. సంచలనాలు వెలుగులోకి

Bigg Boss Telugu 9: కుండలు బద్దలవుతున్నాయ్.. రీతూ వర్సెస్ డిమోన్.. అసలైన ఆట మొదలైంది..

Jagriti Janam Baata: సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ మైన్‌ను సందర్శించిన కవిత.. కీలక వ్యాఖ్యలు