Bison OTT Release: మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ విక్రమ్ నటించిన సినిమా ‘బైసన్ కాలమాదన్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు డిజిటల్ లవర్స్ ను పలకరించడానికి రెడీ అయింది. వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రూ.70 కోట్లకు పైగా గ్రాస్ చేసిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ఓటీటీలో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
నవంబర్ 21 న శుక్రవారం రోజున ‘బైసన్ కాలమాదన్’ స్ట్రీమ్ అవ్వనుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఈ సినిమా తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో ఆడియెన్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుని ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది.
కథ గురించి మాట్లాడుకుంటే.. ‘బైసన్ కాలమాదన్’ కిట్టన్ (ధ్రువ్ విక్రమ్) అనే కుర్రాడి చుట్టూ కథ తిరుగుతుంది. అతని కల భారత జాతీయ కబడ్డీ జట్టులో చోటు సంపాదించడం. కానీ కిట్టన్‌కు అంత ఈజీ కాదు. కులవ్యవస్థ, హింస, సామాజిక ఒత్తిడులను ఇలా ఒకటి కాదు ఎన్నో తట్టుకుని నిలబడి ఎలా పైకి వచ్చాడనేది ఈ కథ. ఒక్క మాటలో చెప్పాలంటే అతని చేసిన ఒక పెద్ద పోరాటం చేశాడనే చెప్పుకోవాలి. “ మీకు కబడ్డీ ఒక ఆట మాత్రమే కావచ్చు, కానీ కిట్టన్‌కి అది అతని జీవితం మొత్తం” అని డైలాగ్ పెట్టి నెట్‌ఫ్లిక్స్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.
ఈ చిత్రం మాజీ జాతీయ కబడ్డీ ఆటగాడు, అర్జున పురస్కార గ్రహీత మనాథి గణేశన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. పసుపతి, రజిషా విజయన్, లాల్, ఆమీర్, అనుపమ పరమేశ్వరన్, అళగం పెరుమాళ్ తదితర నటి నటులు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ మధ్యలో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే, మారి సెల్వరాజ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా ఇది నిలిచింది. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని, పా.రంజిత్ , అదితి ఆనంద్, నీలం స్టూడియోస్ తో కలిసి నిర్మించింది. థియేటర్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో వేచి చూడాలి.
Also Read: Cyber Fraud Alert: ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ మోసాలు.. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక సూచనలు
