CJI Gavai (imagecredit:twitter)
తెలంగాణ

CJI Gavai: రాజ్యాంగం స్థిర పత్రం కాదు.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు

CJI Gavai: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌(B.R. Ambedkar), రాజ్యాంగాన్ని ఏనాడూ ఒక స్థిరమైన పత్రంగా భావించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌(Justice B.R. Gavai) స్పష్టం చేశారు. సామాజిక, ఆర్థిక న్యాయ సాధన లక్ష్యంగానే రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని ఆయన తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సీజేఐ మాట్లాడారు.

అందుకే సవరణ 

‘అంబేడ్కర్‌కు రాజ్యాంగం కాలానుగుణంగా మార్పులు చెందడం అవసరమని తెలుసు, అందుకే సవరణ విధానాలను అందులో చేర్చారు. అంశం ప్రాధాన్యతను బట్టి కొన్ని సవరణలు సులభం, కొన్ని సవరణలు చాలా కఠినంగా ఉంటాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే రిజర్వేషన్ల అంశంపై మొదటి సవరణ జరిగింది. చరిత్రలో సుప్రసిద్ధమైన కేశవానంద భారతి కేసు(Kesavananda Bharathi case) తీర్పు తర్వాత, ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు సమ ప్రాధాన్యం దక్కింది. ఇది రాజ్యాంగ పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలిచింది.

Also Read: Kanta collections: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ డే ఒన్ అధికారిక కలెక్షన్స్ ఎంతంటే..

ఎస్టీ రిజర్వేషన్లలోనూ..

రాజ్యాంగంలోని ఈ రెండు అంశాల సమతుల్యత దేశ ప్రగతికి చాలా ముఖ్యం’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. గతేడాది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏడుగురు జడ్జిల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చింది, క్రిమిలేయర్ విధానం రిజర్వేషన్లకు వర్తిస్తుందా? లేదా? అనే అంశంపై జస్టిస్ గవాయ్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమిలేయర్ విధానం ఉండాలన్నది తన అభిప్రాయం అని ఆయన స్పష్టం చేశారు. ఓబీసీలకు వర్తించే క్రిమిలేయర్‌ నియమం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా వర్తించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Nizamabad Crime: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన పాత నేరస్తుడు వినయ్ గౌడ్.. పాత కక్షలతో ఓ వ్యక్తి పై దాడి..!

Just In

01

Satish death Case: సీఐ మృతి కేసు దర్యాప్తు వేగవంతం.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అర్థమైంది ఏంటంటే?

Pawan Kalyan: పైరసీ ముఠా సూత్రధారి ఇమ్మడి రవి అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందనిదే!

Crime News: భార్య తలపై రోకలిబండతో కొట్టి చంపిన భర్త.. కారణం ఏమిటో తెలుసా?

Royal Enfield Bullet 650: త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లాంచ్..

Viral Video: కూతురికి భోజనం నచ్చలేదని.. ఏకంగా యూనివర్శిటీ ముందే ఫుడ్ స్టాల్ పెట్టేసిన తండ్రి