Local Body Elections: గతంలో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం 23 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు సైతం సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, బీసీ రిజర్వేషన్(BC Reservation) అంశం ప్రస్తావనకు రాలేదని కాంగ్రెస్ భావిస్తున్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధించడంతో అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తుంది. నేడు క్యాబినెట్ మీటింగ్ జరుగనున్నది. ఈ భేటీలో స్థానిక సంస్థల అంశాన్ని ప్రధానంగా చర్చించడంతోపాటు ఎన్నికలకు వెళ్లాలని ఏకగ్రీవంగా నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం.
పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని…
బీసీలకు కాంగ్రెస్ ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల సమయంలో 42శాతం రిజర్వేషన్లను ఇస్తామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ వేసింది. అధ్యయనం చేయించింది. బీసీ కుల గణన చేపట్టింది. దాని ప్రకారం 42శాతం రిజర్వేషన్ ముందుకు పోతామని, స్థానిక సంస్థల్లో అమలు చేసి ప్రభుత్వానికి ప్రకటించింది. ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ సైతం ప్రకటించింది. కానీ ఈ తరుణంలోనే రిజర్వేషన్లపై కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో వాయిదా పడ్డాయి. కోర్టులో విచారణ జరుగుతుంది. కోర్టులో ప్రభుత్వానికి అనుగుణంగా తీర్పు రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు సైతం అమలు చేయాలని భావిస్తున్నది. పార్టీపరంగా ఇస్తే ఎలా ఉంటుందని సమాలోచన చేస్తున్నది.
ఎన్నికలు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదనే
బీసీలకు 23శాతం రిజర్వేషన్లపై జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ప్రచారం సైతం జరిగింది. అది 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ 285ఏ సెక్షన్ ప్రకారం ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆల్‌రెడీ యాక్ట్ ఉండటంతో జీవోతో పంచాయతీ ఎన్నికలు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయానికి సైతం వచ్చినట్లు సమాచారం. ఎస్సీ(SC), ఎస్టీ(ST)లకు సైతం గత రిజర్వేషన్లనే యథావిధిగా అమలు చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.
ఊహించని మెజార్టీ..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊహించని మెజార్టీ రావడం ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని స్పష్టమైనది. ఇదే జోష్‌తో స్థానిక సంస్థలకు వెళ్తే మెజార్టీ స్థానాలను సాధించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యం కావడంతో గ్రామంలో మౌలిక సమస్యలు తిష్ట వేశాయి. ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని యోచిస్తుంది. సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
Also Read: Mahabubabad: ఉప్పు, కారంతోనే భోజనం తింటున్నాం.. కడుపులో మంటతో విద్యార్థుల విలవిల!
