CM Revanth Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

CM Revanth Reddy: తెలంగాణకు ఆర్ఎఫ్‌సీ ఫోర్త్‌ వండర్‌.. పత్రికా రంగంలోనూ కీలక పాత్ర

CM Revanth Reddy: రాష్ట్రంలో నాలుగు వండర్స్ ఉన్నాయని అందులో ఒకటి చార్మినార్, రెండోది గోల్కొండ, మూడోది హైటెక్ సిటీ, నాలుగో వండర్‌గా రామోజీ ఫిలిం సిటీ నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రామోజీ రావు అందించిన విలువలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్న రామోజీ గ్రూప్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. సంస్థలను నిర్వహించడం అంత ఆషామాషీ కాదన్నారు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి రామోజీ ఫిల్మ్ సిటీ ఒక గొప్ప ఎస్సెట్ అంటూ వివరించారు.

Also Read: AV Ranganath: అక్రమ మార్కింగ్‌ల‌పై చ‌ర్యలు.. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే శిక్షలు

ప్రపంచ వ్యాప్తంగా పేరు.. 

స్క్రిప్ట్‌తో వచ్చి ప్రింట్ తీసుకుని వెళ్లండి అని రామోజీ ఫిలిం సిటీని ప్రారంభించినప్పుడు చెప్పేవారని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు ఫిల్మ్ సిటీని ప్రపంచ వ్యాప్తంగా పేరు సాధించిందన్నారు. నిద్రలేవగానే ఈనాడు చదవడం, నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలు చూడడం అందరికీ అలవాటుగా మారి పోయిందన్నారు. వాస్తవాలను అందించాలన్న తపన వారిలో కనిపిస్తుందన్నారు. పచ్చళ్లు తినిపించినా, పత్రిక చదివించాలన్నా.. అది రామోజీ రావుకే సాధ్యమైందని కొనియాడారు. ప్రతీ రంగంలో రామోజీ రావు తన ముద్ర వేశారన్నారు. ఆయన ఆలోచనలని భవిష్యత్ తరాలకి అందించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. రామోజీ ఓ బ్రాండ్ అని ఆ బ్రాండ్‌ను కంటిన్యూ చేసేందుకు ప్రభుత్వం సంపూర్ణ మద్ధతు ఇస్తుందన్నారు.

Also Read: SriDevi: సీనియర్ హీరోయిన్స్ తో పోటీ పడుతున్న కోర్టు బ్యూటీ.. ఒకేసారి నాలుగు సినిమాలు!

Just In

01

Royal Enfield Bullet 650: త్వరలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 లాంచ్..

Viral Video: కూతురికి భోజనం నచ్చలేదని.. ఏకంగా యూనివర్శిటీ ముందే ఫుడ్ స్టాల్ పెట్టేసిన తండ్రి

Dhandoraa Teaser: హైదరాబాద్, అమెరికా.. యాడికైనా బో.. చస్తే ఇడీకే తేవాలె!

Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష.. ఢాకా కోర్టు సంచలన తీర్పు

Teachers Unions: ఢిల్లీలో పార్లమెంట్ మార్చ్‌కు ఉపాధ్యాయ సంఘాల పిలుపు.. ఎందుకంటే?