Vasudeva Sutham Song: బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మాతగా మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, మోషన్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి హీరో ఆకాష్ జగన్నాథ్ రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో మెలోడీ గీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రిలీజ్ చేశారు.
Reada also-Keerthy Suresh: యూనిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులైన కీర్తీ సురేశ్..
‘ఏమైపోతుందో’ అంటూ సాగే ఈ పాటకు మంచి మెలోడీ ట్యూన్‌ను అందించారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. శ్రీ హర్ష ఈమని అందించిన సాహిత్యం, పవన్-శృతిక సముద్రాల గాత్రం అందరినీ కట్టి పడేసేలా ఉంది. ఈ లిరికల్ వీడియోలో హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ, వారి లవ్ ట్రాక్‌ను అందంగా చూపించారు. ఇక లొకేషన్స్ కూడా ఎంతో సహజంగా కనిపిస్తున్నాయి. గాల్లో తేలిపోతోన్న ప్రేమికులు పాడుకునే పాటలా ఈ మెలోడీని తీర్చి దిద్దారు.
Read also-Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే..
పాటను రిలీజ్ చేసిన అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘‘వసుదేవసుతం’లోని ‘ఏమైపోతుందో’ అనే ఈ పాట చాలా బాగుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మంచి ట్యూన్‌ను ఇచ్చారు. సాహిత్యం కూడా చాలా బాగుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది. మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మైమ్ గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు ప్రధాన తారాగణంగా కనిపించనున్నారు.
