Minister Vakiti Srihari (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Vakiti Srihari: మత్స్యకారుల సంక్షేమం అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి వాకిటి శ్రీహరి

Minister Vakiti Srihari: మత్స్యకారుల సంక్షేమం, ఆభివృద్దే ప్రభుత్వ ధ్యేయం చేపల ఉత్పత్తి లో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా చర్యలు చేపడతాం, స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో చేప పిల్లలు, రొయ్యల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, డైరీ అబివృద్ధి, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మత్స్యకారులకు 100 శాతం రాయితీతో చేపలు పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని ధర్మసాగర్ రిజర్వాయర్ లో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ సాయికుమార్, రాష్ట్ర తెలంగాణ ముదిరాజ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొర్రాజ్ఞానేశ్వర్‌, తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మత్స శాఖ సంచాలకులు నిఖిల, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ లతో కలసి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై రూ.12 లక్షల చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. మత్స్య కారుల సంక్షేమమే ధ్యేయంగా ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల చెరువుల్లో 84 కోట్ల చేప పిల్లులు, రూ.10 కోట్ల రొయ్య పిల్లలు వదిలేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా ఉండేలా చెరువుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్య సంపద మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

చేపల రకాలను బట్టి.. 

మత్స్య శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.123 కోట్లు కేటాయించారని తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో చేప పిల్లల, రొయ్యల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తామని చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి ఆన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ధర్మసాగర్ చెరువు రిజర్వాయర్ లా కాకుండా పర్యాటక కేంద్రంగా చేపల రకాలను బట్టి ఏ చేపలను ఏ నిష్పత్తిలో విడుదల చేయాలో అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రొయ్య పిల్లల పెంపకానికి కృషి చేస్తామని, మత్స్యకారులు జీవితాలు బాగుపడేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారులు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని, పిల్లలలకు మంచి విద్యాబుద్ధులు చెప్పించాలని సూచించారు. విద్యతోనే మంచి స్థాయికి చేరుకుంటామని అన్నారు. చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా జరిగేలా ఏ చేప దాని సైజ్ అవి ఎన్ని చేప పిల్లలు అని తెలిపేలా చెరువుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మత్స్య సంపదపై రాష్ట్రంలో 5 లక్షల మంది మత్స్య కారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని వారి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. చేపల ఉత్పత్తి కేంద్రాలు గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో ఫిష్ మార్కెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మత్స్య కారులకు కోటి 40 లక్షలతో బీమా ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు.

ప్రమాదవశాత్తు చనిపోతే..   

మత్స్య కార సహకార సంఘాల్లో మత్స్యకారులకు సభ్యత్వం కల్పిస్తామని అన్నారు. మత్స్య కారులకు చేపల విక్రయానికి మొబైల్ వాహనాలు పంపిణీ చేశామని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ధర్మసాగర్ రిజర్వాయర్ లో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. సాగునీటి పారుదల శాఖ అధికారులు తూముల ద్వారా నీళ్లు వదిలిపెట్టినప్పుడు చిన్న చిన్న చేప పిల్లలు అన్ని కూడా కొట్టుకపోతున్నాయి. తద్వారా వారికి రావాల్సిన దిగుబడి రావడం లేదన్నారు. కాబట్టి సాగునీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే ఐరన్ తో చేసిన గ్రిల్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. మత్స్య సహకార సంఘంలో 560 మంది వరకు సభ్యులు ఉన్నారని, ఇంకా 160 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సంఘంలో సభ్యత్వ అర్హతల ప్రకారం ఒక చెరువు విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని ఇవ్వాలన్నారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే ఎవరికైతే సభ్యత్వం ఉన్నదో వాళ్లకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియ ప్రభుత్వం అందిస్తున్నదని అన్నారు. చేపల ఉత్పత్తి లో దేవాదుల ఎత్తిపోతల పథకం కింద 7 రిజర్వాయర్లు ఉన్నాయని, దాదాపు 7 రిజర్వాయర్ లో కూడా 365 రోజులు నీళ్లుంటాయి.. చేపల పెంపకానికి ఇవన్నీ చాలా అనువైన రిజర్వాయర్లు అని , ఒక్కొక్క రిజర్వాయర్లో 12 లక్షలు, పెంచే అవకాశం ఉందన్నారు. రెండు రిజర్వాయర్లలో చేప పిల్లల పెంపక కేంద్రాలను మంజూరు చేయాలని కోరారు.

Also Read: Mahesh Babu: నాన్న.. నువ్వు గుర్తొస్తున్నావ్.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్, ఫ్యాన్స్ కన్నీళ్లు

రూ.25 లక్షలు వరకు ఖర్చు..   

రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలకు, ముదిరాజ్ కుటుంబాలకు, గంగపుత్ర కుటుంబాలకు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో రూ. 123 కోట్ల రూపాయలను కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి స్వర్ణ యుగాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరిలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మత్స్యశాఖ సంచాలకులు నిఖిల మాట్లాడుతూ వ్యాప్తంగా 122 కోట్లతో 26వేలకు పైగా చేప పిల్లల్ని వదులుతున్నామని దీని ద్వారా నాలుగు నుండి ఐదు లక్షల మంది మత్స్య కార్మిక కుటుంబాలకు ఆదాయం చేగురుతుందన్నారు. చేపల పిల్లలను చెరువులో అధికారులు వదిలే సమయంలో సమయంలో సొసైటీ సభ్యులు చేపల సైజు, సంఖ్యను పరిశీలించాలన్నారు. తదుపరి ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో 830 చెరువులు కుంటలు ఉన్నాయని అన్నారు. చెరువుల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని మొదలుపెట్టామని పేర్కొన్నారు. మనకున్న అన్ని చెరువులలో ధర్మసాగర్ రిజర్వాయర్ అత్యంత పెద్దదని, ఈరోజు చెరువులో 12 లక్షల చేప పిల్లల్ని వదులుతున్నామన్నారు. దానికి సుమారుగా రూ.25 లక్షలు వరకు ఖర్చు పెడుతున్నామని అన్నారు. ఇదే ధర్మసాగర్ చెరువులో గతేడాది 6 లక్షల చేప పిల్లలని వదలాగా 250 టన్నుల వరకు దిగుబడి వచ్చిందని, దాని ద్వారా రూ. 25-30 లక్షల వరకు మత్స్యకారులు ఆదాయం పొందారని తెలిపారు. మత్స్యకారులు, ఇరిగేషన్ అధికారులు చెరువులో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పుడు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అదనపు సంచాలకులు శ్రీనివాస్, డీడి హనుమంతరావు, జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీపతి, చీఫ్ ప్రోమోటర్ మల్లేశం, సోమయ్య, తహశీల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్ మత్స్య సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణ క్రీడా పాఠశాల ప్రారంభం

హనుమకొండ లోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ క్రీడా పాఠశాలను ఆదివారం రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య,డైరీ అబివృద్ధి, క్రీడలు, యువజన శాఖ క్రీడల మత్స్యశాఖ మాత్యులు వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజ్ , తెలంగాణ రాష్ట్ర క్రీడల ప్రాధికారిక సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మత్స్య శాఖ చైర్మన్ సాయికుమార్, రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా బొర్రాజ్ఞానేశ్వర్‌, రాష్ట్ర క్రీడల శాఖ విసి అండ్ ఎం డి సుమబాల, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: Varanasi Release Date: మహేష్ బాబు ‘వారణాసి’ సినిమా విడుదల అప్పుడేనా.. ఎందుకు అంత లేట్..

Just In

01

IBomma: ఇక ఐ బొమ్మ బప్పంకు తెరపడినట్టే.. వెబ్ సైట్లు క్లోస్ చేసిన పోలీసులు

Illegal Constructions: ఉమ్మడి రంగారెడ్డిలో ఫామ్ ల్యాండ్ వ్యాపారం.. పట్టించుకోని అధికారులు

Huzurabad News: హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్‌పై వివక్ష.. బెదిరింపు ఆరోపణలు

Jagtial Substation: ఓ విధ్యుత్ సబ్ స్టేషన్‌లో మందు పార్టీ.. సిబ్బంది పని తీరు పై విమర్శలు

Medchal Municipality: ఆ మున్సిపల్‌లో ఏం జరుగుతుంది.. మున్సిపల్ కమిషనర్ ఉన్నట్లా? లేనట్లా..?