Seethakka ( image credit: swetcha reporter)
తెలంగాణ

Seethakka: మహిళా సమాఖ్యలతో కొత్త చరిత్ర.. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెటింగ్

Seethakka: రాష్ట్ర అభివృద్ధికి వెలుగు మహిళలే అని, కష్టాలు వచ్చినా మహిళలు వెనక్కి తగ్గకూడదని, ప్రజా ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క (Seethakka) భరోసా ఇచ్చారు. మహిళా సంఘాలు ఆర్థిక, సామాజిక రంగాల్లో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రజాభవన్‌లో మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. సంఘాల సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆడపిల్లలకు 21 ఏండ్లు నిండిన తరువాతనే వివాహం, ప్రతి ఆడపిల్లను చదివించడం, మహిళలపై జరిగే ఏ రకమైన హింసకైనా ఎదిరించడం, కులమత భేదాలను వదిలివేయడం, అంటరానితనాన్ని నిర్మూలించడంలో ముందుండడం వంటి అంశాలపై మహిళలతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల రూపంలో సగటు స్త్రీ అస్తిత్వం మరింత శక్తివంతమవుతోందన్నారు.

Also Read:Seethakka: మహిళా సంక్షేమంపై నెదర్లాండ్‌లో అధ్యయనం.. విదేశీ పర్యటనలో మంత్రి సీతక్క

అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్

స్వయం సహాయకసంఘాల భాగస్వామ్యంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, వారిని గ్లోబల్ మార్కెట్‌ వైపు తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి వారిని ఆర్థికంగా బలంగా నిలబెట్టే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మండల సమాఖ్యల్లో కోట్ల నిధులు ఉండటం, గ్రామీణ మహిళలు వ్యాపారాలు నెలకొల్పడం ఆ లక్ష్యాన్ని సాకారం చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఏటా 20 వేల కోట్లకు పైగా బ్యాంకులు ఎస్హెచ్జీ లకు రుణాలు ఇవ్వడం, అందులో 99 శాతం రుణాలు తిరిగి చెల్లించడం మహిళల నిబద్ధతకు నిదర్శమన్నారు. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.

ప్రత్యేక యూనిఫార్మ్ చీరలు త్వరలో అందజేస్తాం

గ్రామాల్లో, మండలాల్లో మహిళా సమాఖ్యలు ఒంటరి మహిళలకు భరోసాగా నిలుస్తున్నాయని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు లబ్ధిదారులకు మహిళా సంఘాలు ముందుగానే ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమన్నారు. స్వయం సహాయక సంఘాలే సాధారణ స్త్రీకి అస్తిత్వాన్ని ఇచ్చే వేదికలన్నారు. 65 లక్షల మహిళా సభ్యులు పిడికిళ్లు బిగిస్తే చీకట్లన్నీ తొలగిపోతాయని, మహిళల శక్తితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని పేర్కొన్నారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ జయంతి రోజూన మహిళా శక్తి బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడతామని, మహిళా సమాఖ్య సభ్యులకు ప్రత్యేక యూనిఫార్మ్ చీరలు త్వరలో అందజేస్తామని ప్రకటించారు. సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ, ఇందిరా గాంధీలా మహిళలు ధైర్యంగా నిలబడితే కొత్త చరిత్ర లికించ వచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌, తదితరులు పాల్గొన్నారు.

Also Read:Seethakka: బీసీల‌కు 42 శాతం రిజర్వేష‌న్లు క‌ల్పించాం.. సీత‌క్క కీలక వ్యాఖలు

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!