Parliament speaker to be declare
Politics

Oath: పార్లమెంటులో తెలంగాణ ఎంపీల ప్రమాణం

– తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్‌లో ప్రమాణం
– ఆ తర్వాత భిన్నమైన నినాదాలు
– అసదుద్దీన్ వ్యాఖ్యలు వివాదాస్పదం
– ఎంపీలతో సోనియాగాంధీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
– కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ

Telangana MPs: పార్లమెంటులో తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. కేంద్రమంత్రులుగా బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు మినహా 15 మంది ఎంపీలు మంగళవారం ప్రమాణం చేశారు. రాహుల్ గాంధీ కూడా ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆ తర్వాత పార్లమెంటు ఆవరణలో తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు.

18వ లోక్ సభ సమావేశాలు ఎంపీల ప్రమాణ స్వీకారాలతో సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు సహా పలు పార్టీల ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో రోజు మిగిలిన ఎంపీలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. కొందరు వేర్వేరు భాషల్లో ప్రమాణ స్వీకారం చేయగా.. ప్రమాణం చేసిన తర్వాత విభిన్నమైన నినాదాలు ఇస్తూ ముగించారు. తెలంగాణ నుంచి ప్రమాణం చేసిన 15 మంది ఎంపీలు కొందరు తెలుగు, మరికొందరు ఇంగ్లీష్‌లో ప్రమాణం చేయగా.. ఇంకొందరు ఉర్దూ, హిందీ భాషలో ప్రమాణం తీసుకున్నారు.

ఎంపీ సురేష్ షెట్కర్, ఈటల రాజేందర్, డీకే అరుణ, మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్‌లు తెలుగులో ప్రమాణం చేయగా.. గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రామసాయం రఘురాం రెడ్డిలు ఇంగ్లీష్‌లో ప్రమాణం తీసుకున్నారు. గొడెం నగేశ్ హిందీలో, అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణం చేశారు.

కడియం కావ్య తన ప్రమాణం ముగిశాక జై తెలంగాణ, జై భీమ్, జై భద్రకాళి అని నినాదం ఇచ్చారు. మల్లు రవి, రఘురాం రెడ్డిలు జై తెలంగాణ, జై భీం అని నినదించారు. సురేష్ షెట్కర్, రఘునందన్, ఈటల రాజేందర్, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్‌లు జై తెలంగాణ అన్నారు. ఈటల జై సమ్మక్క అని కూడా అన్నారు. బలరాం నాయక్ జై తుల్జా భవాని అని కూడా పేర్కొన్నారు.

ఉర్దూలో ప్రమాణం చేసిన అసదుద్దీన్ ఒవైసీ చివరిలో జై భీం, జై మీమ్ అంటూ జై పాలస్తీనా అని కూడా అన్నారు. అల్లాహో అక్బర్ అంటూ ముగించారు. జై పాలస్తీనా అనే వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీజేపీ ఎంపీలు ఆ వ్యాఖ్యలను రికార్డులో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రొటెం స్పీకర్ ఈ అంశాన్ని పరిశీలిస్తామని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటే తొలగిస్తామని చెప్పారు. ఒక ఓ బీజేపీ ఎంపీ జై హిందూ రాజ్య అని నినాదం ఇచ్చారు. రాహుల్ గాంధీ మాత్రం జై సంవిదాన్ అని రాజ్యాంగ పుస్తకాన్ని చూపిస్తూ నినాదం ఇచ్చారు.

కాంగ్రెస్ ఎంపీలకు విప్

రేపు లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఉన్నందున కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ చేసింది. కాంగ్రెస్ చీఫ్ విప్ కే సురేశ్ పార్టీ ఎమ్మెల్యేలకు త్రీ లైన్ విప్ జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ బుధవారం ఉదయం 11 గంటలకు లోక్ సభలో ఉండాలని ఆదేశించారు. సభ వాయిదా పడే వరకు తప్పకుండా లోక్ సభలోనే ఉండాలని సూచించారు. లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొనాలని తెలిపారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు