SSMB29-story-leak(X)
ఎంటర్‌టైన్మెంట్

SSMB29 story leak: టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ పూర్తవక ముందే లీకైన ‘SSMB29’ స్టోరీ.. సంబరాల్లో ఫ్యాన్స్

SSMB29 story leak: భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘SSMB29’. ఈ సినిమా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతుంది. ఇప్పటికే కేవలం టైటిల్ గ్లింప్స్ కోసం దేశంలోనే కనీ వినీ ఎరుగని రేంజ్ లో ఈవెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ గురించి చిన్న వార్త వచ్చినా అది సంచలనమే అవుతుంది. అయితే ఈ సినిమా కు సంబధించి ఏకంగా కథాంశంమే ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు వచ్చిన వార్తలు వస్తున్నాయి. ఈ వార్త సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ఈ కథ అధికారికంగా ధృవీకరించనప్పటికీ, లీకైన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఒక అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందబోతోందని తెలుస్తోంది. ఇంకా కనీసం టైటిల్ గ్లింస్స్ ఈవెంట్ పూర్తవకముందే ఇలాంటి వార్తలు అభిమానులకు కలవరపెడుతున్నాయి. కానీ స్టోరీ మాత్రం గ్లోబల్ రేంజ్ లో ఉండటంతో ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read also-iBOMMA: ఐబొమ్మకు బిగ్ షాక్.. నిర్వహకుడు ఇమ్మడి రవి అరెస్ట్?

లీకైన కథాంశం ప్రకారం, మహేష్ బాబు పోషించే పాత్ర ఒక ‘రగ్గడ్ ఎక్స్‌ప్లోరర్’ (సాహస యాత్రికుడు) తరహాలో ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం ‘ఇండియానా జోన్స్’ సిరీస్ నుండి ప్రేరణ పొందిన పాత్ర అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మహేష్ బాబు లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు సరిపోయే విధంగా పూర్తిగా కొత్తగా ఉంటుందని సమాచారం. సినిమా కథ ప్రధానంగా ఒక సుదీర్ఘకాలంగా పోయిన రహస్యం చుట్టూ తిరుగుతుంది. ఈ రహస్యాన్ని కనుగొనడానికి, కథానాయకుడు అపరిమితమైన, ప్రమాదకరమైన అడవులు మారుమూల ప్రాంతాల గుండా ఒక సాహసయాత్రను ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో, అతను కేవలం ప్రకృతి సవాళ్లను మాత్రమే కాక, ప్రాచీన పురాణాలు శక్తివంతమైన అంతర్జాతీయ శక్తుల నుండి వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రహస్యం ప్రపంచాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుందని, దానిని కాపాడటమే హీరో లక్ష్యమని తెలుస్తోంది.

Read also-Mahesh Babu: గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్ కు వచ్చేవారికి మహేష్ బాబు సందేశం ఇదే..

ఈ చిత్ర కథాంశం భారతీయ పురాణాల మూలాలను కూడా కలిగి ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, మహేష్ బాబు పాత్రకు హిందూ పురాణాలలోని హనుమంతుడి లక్షణాల నుండి ప్రేరణ లభించినట్లు తెలుస్తోంది. ఇది ముఖ్యంగా అడవి నేపథ్యంలో సాగే సాహసం హీరో అసాధారణ బలం, తెలివితేటలు, విధేయత వంటి అంశాలలో ప్రతిబింబించవచ్చని భావిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు 900 నుండి 1000 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతోందని అంచనా. మొత్తం మీద, ‘SSMB29’ కేవలం ఒక భారతీయ చిత్రం కాకుండా, గ్లోబల్ ఆడియన్స్ను లక్ష్యంగా చేసుకున్న ఒక ఫాంటసీ, అడ్వెంచర్ మాస్టర్‌పీస్‌గా రూపుదిద్దుకుంటుందని లీకైన కథాంశం స్పష్టం చేస్తోంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Just In

01

Varanasi Glimpse: ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. మహేష్ బాబు ఇరగదీశాడుగా

New Bus Stations: ప్యాసింజర్లకు గుడ్‌న్యూస్.. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో 3 బస్‌స్టాండ్లు.. ఎక్కడెక్కడో తెలుసా?

Farooq Abdullah: ఉగ్రదాడిలో వైద్యుల ప్రమేయంపై ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు… తీవ్ర వివాదాస్పదం

AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!

Rahul Gandhi: వెరీ గుడ్ రేవంత్ టీమ్ వర్క్ సూపర్ గో హెడ్.. రాహుల్ గాంధీ కాంప్లిమెంట్!