mahesh-babu( image :x)
ఎంటర్‌టైన్మెంట్

Mahesh Babu: గ్లోబ్ ట్రూటర్ ఈవెంట్ కు వచ్చేవారికి మహేష్ బాబు సందేశం ఇదే..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘SSMB29’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ మెగా ఈవెంట్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో, మహేష్ బాబు స్వయంగా ఒక ముఖ్యమైన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read also-Bigg Boss 9: ఆ మెమోరీస్ గుర్తు చేసుకుని ఎమోషన్ అయిన బిగ్ బాస్ సభ్యులు.. పాపం తినడానికి తిండిలేక..

వీడియోలో మహేష్ బాబు ఏం చెప్పారు అంటే.. ఈ వీడియోలో మహేష్ బాబు ప్రధానంగా ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానుల భద్రత నియమాలను పాటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అభిమానులందరూ సురక్షితంగా ఈవెంట్‌కు వచ్చి, సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్లాలని ఆయన కోరుకున్నారు. ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌కు ప్రత్యేకంగా రూపొందించిన ‘పాస్‌పోర్ట్‌లు’ ఉన్నవారు మాత్రమే రావాలని మహేష్ స్పష్టం చేశారు. “రామోజీ ఫిల్మ్ సిటీ ప్రధాన గేట్లు మూసి ఉంటాయి. పాస్‌పోర్ట్‌లు లేని అభిమానులు దయచేసి తొందరపడి లేదా కంగారుపడి రావద్దు” అని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈవెంట్‌కు సురక్షితంగా వచ్చి, మళ్లీ ఇంటికి సురక్షితంగా వెళ్లాలని కోరుతూ, అభిమానులందరూ అక్కడ ఏర్పాట్లు చేసిన భద్రతా సిబ్బంది పోలీసులకు పూర్తిగా సహకరించాలని మహేష్ బాబు కోరారు. అభిమానుల సహకారంతో ఈ ఈవెంట్‌ను సురక్షితంగా మరపురాని జ్ఞాపకంగా మార్చుకుందామని ఆయన ఆకాంక్షించారు.

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా, ఈవెంట్‌ను పర్యవేక్షించే అధికారులు కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. రాజమౌళి కూడా దీని గురించి అంతకుముందే ఒక సందేశాన్ని ఇచ్చారు. ఈవెంట్‌కు వచ్చే 50,000 మందికి పైగా అభిమానుల భద్రత కోసం ప్రత్యేకంగా ‘పాస్‌పోర్ట్’ తరహా ఎంట్రీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ పాస్‌పోర్ట్‌లో రూట్ మ్యాప్ క్యూఆర్ కోడ్ వంటి వివరాలు ఉన్నాయి. ఇవి అభిమానులను నిర్దేశిత పార్కింగ్, ఎంట్రీ పాయింట్‌లకు చేరడానికి సహాయపడతాయి. 18 ఏళ్లలోపు పిల్లలకు వృద్ధులకు ఈ ఈవెంట్‌కు అనుమతి లేదని కూడా అధికారులు స్పష్టం చేశారు.

Read also-Pushpa 3: అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఇదే.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో సినిమా టైటిల్, కాన్సెప్ట్ మహేష్ బాబు పాత్రకు సంబంధించిన మూడు నిమిషాల టీజర్ ను 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు ఉన్న అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని జియోహాట్ స్టార్ లో ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు ప్రముఖ యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మహేష్ బాబు ఇచ్చిన ఈ బాధ్యతాయుతమైన సందేశం అభిమానులకు ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలను మరింత పెంచింది. ఈ ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ సినీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఈవెంట్ ఎలా సాగుతుందో చూడాలిమరి.

Just In

01

Telangana BJP: జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల ఫలితాలలో కాషాయ పార్టీ ఘోర పరాజయం.. ఓటమి బాధ్యత ఎవరిది?

Severe Cold Wave: హైదరాబాదీలకు వణుకుపుట్టించే అప్‌డేట్ ఇదీ.. రాబోయే 6 రోజులు తట్టుకోలేరు!

DGP Shivadhar Reddy: నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో.. ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు : డీజీపీ శివధర్ రెడ్డి

Auto Driver Theft: రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఆటో డ్రైవర్ సాయం.. కానీ రూ.10 లక్షలతో పరారీ

Bihar Election Results: ఇదేం ట్విస్ట్!.. బీహార్‌లో బీజేపీ, జేడీయూ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న ఆర్జేడీ