Akhanda 2: నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న మరో చిత్రం ‘అఖండ 2 తాండవం’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ ఎవైటెడ్ సాంగ్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో బాలయ్య అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఫుల్ సాంగ్ విడుదల అవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాల విజయాలు ఎంతటి విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబో నుంచి వస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’, దీనికి సంబంధించిన తొలి పాట ‘ది తాండవం’ విడుదలవ్వడం అభిమానుల్లో ఉత్సాహాన్ని అమాంతం పెంచింది.
Read also-JetLee movie: కమెడియన్ సత్య కొత్త మూవీ టైటిల్ ఇదే.. అప్పుడే నవ్వించడం స్టార్ట్ చేశాడుగా..
‘ది తాండవం’ పాటను 2025 నవంబర్ 14న ముంబైలోని పీవీఆర్ జుహూలో ఒక గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ పాట విడుదల కాకముందే, దాని ప్రోమో భారీ అంచనాలను పెంచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ ఈ పాటను అద్భుతమైన పవర్ ఫుల్ బీట్స్, భక్తి భావనతో కూడిన శ్లోకాలతో స్వరపరిచారు. పాటలో బాలకృష్ణ ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో ఢమరుకంతో చేసిన ‘అఖండ తాండవం’ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. సాక్షాత్తూ పరమశివుడే నేలపైకి దిగివచ్చాడా అన్నంత రౌద్ర రూపంలో బాలయ్య కనిపించారంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ వంటి ప్రముఖ గాయకులు ఈ పాటను ఆలపించడం పాట స్థాయిని మరింత పెంచింది. ‘అఖండ 2: తాండవం’ చిత్రం కేవలం తెలుగుకే కాకుండా, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఒకేసారి విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టించే లక్ష్యంతో ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్త, పవర్ ఫుల్ పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే మొదలయ్యాయి.
Read also-Bigg Boss 9: ఆ మెమోరీస్ గుర్తు చేసుకుని ఎమోషన్ అయిన బిగ్ బాస్ సభ్యులు.. పాపం తినడానికి తిండిలేక..
పాటను చూస్తుంటే.. బాలయ్య బాబు మరోసారి ఈ పాటతో మ్యాజిక్ చేశాడు. బోయపాటి యాక్షన్ చూస్తుంటే ఈ పాట తోనే అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. థమన్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పనక్కర్లేదు. అసలే బాలయ్య బాబు.. ఆయనకు తోడు థమన్ సంగీతం ఈ సారి కూడా ఈ పాటకు థియేటర్లలో సౌండ్ బాక్సులు బద్దలవుతాయి. పాటలో బాలయ్య తాండవం చేస్తుంటే ఫ్యాన్స్ పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ పాటతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
