Singareni: సింగరేణికి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డ్
Singareni ( image credit: twitter)
Telangana News

Singareni: సింగరేణికి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డ్.. స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో ఎంపిక!

Singareni: కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో కోల్ ఇండియా కంపెనీలు, సింగరేణి, ఇతర గనుల సంస్థల్లో నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. న్యూఢిల్లీలో  జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ అవార్డును సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌కు అందజేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ, స్పెషల్ క్యాంపెయిన్ 5.0ను విజయవంతం చేయడంలో ఉద్యోగులు, అధికారుల పాత్రను అభినందించారు.

Also ReadSingareni Collieries: పనితీరులో అలసత్వం వద్దు.. టార్గెట్ కంప్లీట్ చేయాల్సిందే..!

స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0

సింగరేణి సంస్థ బొగ్గు, విద్యుత్ గ్రీన్ ఎనర్జీ వంటి ఉత్పత్తిలోనే కాకుండా పచ్చదనం, పరిశుభ్రతలో కూడా మంచి పేరును సాధించడం సంతోషకరమన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని 30 రోజులు పాటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల ప్రాంతాలలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0ను నిర్వహించినట్లు చెప్పారు. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా సింగరేణి సంస్థ అన్ని ఏరియాల్లో కార్యాలయాలను, ప్రాంగణాలను శుభ్రపరచడం, అవసరం లేని ఫైళ్లను గుర్తించి వాటిని తొలగించడం వంటి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ప్రదేశాల్లో 7,65,583 చదరపు అడుగుల విస్తీర్ణం

సింగరేణి వ్యాప్తంగా మొత్తం 355 ప్రదేశాల్లో 7,65,583 చదరపు అడుగుల విస్తీర్ణంలో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అలాగే, వివిధ శాఖల్లో సంవత్సరాల తరబడి నిరుపయోగంగా పడి ఉన్న ఫైళ్లను కూడా తొలగించినట్లు చెప్పారు. 1,70,000 ఫైళ్లను తనిఖీ చేసి వీటి నుంచి పూర్తిగా నిరుపయోగమని భావించిన 56,200 ఫైళ్లను సంబంధిత కార్యాలయాలు తొలగించాయన్నారు. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా కంపెనీలతోపాటు ఇతర కంపెనీలు కలిసి 14 సంస్థల్లో ఈ కార్యక్రమం చేపట్టగా సింగరేణి సంస్థ అన్నింటినీ మించి అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.

Also Read: Singareni Collieries: భవిష్యత్తులో కీలక ఖనిజాల తవ్వకాలు ఉంటే భాగస్వాములవుతాం

Just In

01

Sai Durgha Tej SYG: ఎద్దును పట్టుకుని.. ఊరమాస్ అవతార్‌లో తేజ్.. పోస్టర్ వైరల్!

Municipal Elections: మున్సీపాలిటీ వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ.. నేడో రేపో రిజర్వేషన్ల ఖరారు

kite Accident: పండుగరోజు విషాదం.. గాలిపటం ఎగిరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి గాయాలు

Maoist Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. 52 మంది మావోయిస్టులు సరెండర్..!

Nabha Natesh: అతిలోక సుందరిలా నభా.. ‘నాగబంధం’ ఫస్ట్ లుక్ చూశారా?