Soy Milk vs Cow Milk: ఆరోగ్య జాగ్రత్తలు పెరుగుతున్న క్రమంలో సోయా పాలు, ఆవు పాలలో ఏది మంచిదో అనే దానిపై చర్చ ఎక్కువవుతోంది. రెండింటికీ ప్రత్యేకమైన పోషక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఏది మీకు సరిపోయేదో మీ ఆరోగ్య లక్ష్యాలు, ఆహారపు అలవాట్లు, రుచిపై ఆధారపడి ఉంటుంది.
ఆవు పాలు
ఆవు పాలలో సహజంగానే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12, రైబోఫ్లావిన్ లు ఉంటాయి . ఇవి ఎముకలు, కండరాల బలానికి సహాయపడతాయి. అయితే, ఆవు పాలలో సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె సమస్యలు లేదా లాక్టోజ్ అసహనం ఉన్నవారికి ఇది అంతగా అనుకూలం కాదు.
Also Read: Breast Cancer: యువతుల్లో పెరుగుతోన్న బ్రెస్ట్ క్యాన్సర్.. కారణాలు ఇవే
సోయా పాలు
సోయాబీన్స్‌తో తయారయ్యే సోయా పాలు సహజంగానే లాక్టోజ్-ఫ్రీ ఉంటుంది. ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ పరంగా ఇది ఆవు పాలతో సమానంగా ఉంటుంది. అలాగే చాలా బ్రాండ్లు కాల్షియం, విటమిన్ D, B12 వంటివి ఫోర్టిఫై చేసి ఇస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
సోయా పాలు బెస్ట్. ఇది జీర్ణం చేయడం కూడా సులభంగా ఉంటుంది. సోయా పాలలోని ప్రోటీన్లు, మంచి కొవ్వులు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. ఎముకలు, కండరాల బలానికి ఆవు పాలు ఉపయోగపడతాయి. ఆవు పాలు సహజ కాల్షియం, విటమిన్ D కలిగివుండడంతో కొంత మోతాదులో మెరుగ్గా ఉంటాయి. అయితే, ఫోర్టిఫై చేసిన సోయా పాలు ఈ లాభాలను సమానంగా ఇస్తాయి.
Also Read: Bigg Boss Telugu 9: హౌస్‌లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!
మరి, వీటిలో ఏది మంచిది?
మీకు లాక్టోజ్ సమస్య లేకపోతే, సహజ కాల్షియం, ప్రోటీన్ కావాలంటే ఆవు పాలు బెటర్. మీరు వేగన్, లాక్టోజ్-ఇంటాలరెంట్ లేదా తక్కువ కొవ్వు, కావాలని అనుకుంటే సోయా పాలు బెటర్.
సోయా పాలు– తక్కువ క్యాలరీలు, తక్కువ కొలెస్ట్రాల్‌తో ఉంటుంది.
ఆవు పాలు– ఎముకల బలం కోసం ఇది మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
