Gaddam Prasad Kumar: పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ శుక్ర, శనివారాల్లో (14, 15 తేదీల్లో) కొనసాగనుంది. ఈ విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) సమక్షంలో జరగనుంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి(Srinivass Reddy)పై జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy), శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(MLA Arikepudi Gandhi)పై కల్వకుంట్ల సంజయ్(Kalvakuntla Sanjay) అనర్హత పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
క్రాస్ ఎగ్జామినేషన్..
గతంలో పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన అనంతరం విచారణ వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 12, 13 తేదీల్లో ప్రతివాదులుగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీని పిటిషనర్ల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంది. అయితే స్పీకర్ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా ఆ విచారణ వాయిదా పడింది. దీంతో తిరిగి నవంబర్ 14, 15 తేదీల్లో విచారణ చేపట్టనున్నారు. ఈ విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో సందర్శకులకు, మీడియాకు ఆంక్షలు విధిస్తున్నట్లు స్పీకర్ కార్యాలయం బులెటిన్ విడుదల చేసింది.
Also Read: TG TET-2026: నిరుద్యోగులకు బిగ్ అలెర్ట్.. టెట్ షెడ్యూల్ విడుదల
మాజీ ఎమ్మెల్సీలకు..
అలాగే, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ప్రవేశాన్ని నిషేధించారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేవలం వారి పార్టీల సభాపక్ష కార్యాలయాల వరకే అనుమతి ఉంటుందని ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), దానం నాగేందర్(Danam Nagender)పై దాఖలైన అనర్హత పిటిషన్లకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: ACB Raid: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్.. లంచం ఎంతంటే?
