TG TET – 2026: తెలంగాణలో టీజీ టెట్ – 2026 షెడ్యూల్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ బోర్డు.. టెట్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను శుక్రవారం సాయంత్రం అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రకారం. నవంబర్ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈనెల 29 వరకూ అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఏటా రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫస్ట్ ఫేజ్ టెట్ పరీక్షలను జూన్ లో నిర్వహించి.. జూలై 22న వాటి తాలుకా ఫలితాలను విడుదల చేశారు. ఈ క్రమంలోనే రెండో టెట్ నోటిఫికేషన్ విడుదల కావడం గమనార్హం. నవంబర్ 15న దరఖాస్తులు అంటే శనివారం నుంచే అభ్యర్థులు తమ అప్లికేషన్స్ ను ఆన్ లైన్ నమోదు చేసుకోవచ్చు.
