Guddi Maruti ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Guddi Maruti: ‘ఖిలాడి’లో అక్షయ్ కుమార్‌తో చేసిన కిస్సింగ్ సీన్ గుర్తుచేసుకున్న నటి

Guddi Maruti: 90 ‘ స్ సమయంలో ఆడియెన్స్ ను అలరించిన నటి గుడ్డి మారుతి, తన సినీ ప్రయాణంలో జరిగిన ఓ సరదా జ్ఞాపకాన్ని తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె ఈ రోజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి చేసిన “ఖిలాడీ” సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

పోస్ట్ చేసిన మొదటి ఫొటోలో గుడ్డి, అక్షయ్ చెంపపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపించగా, మరొక స్టిల్‌లో ఇద్దరూ కాలేజ్ కాంటీన్ సెట్‌లో నిలబడి ఉన్నారు. ఈ సన్నివేశం అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఫన్నీ సీన్‌లో భాగం.

Also Read: Collector Santhosh: ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కృషి.. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలి కలెక్టర్ సంతోష్

ఫోటోలతో పాటు గుడ్డి సరదాగా ఇలా క్యాప్షన్ ఇచ్చారు. “Ek kiss ki keemat tum kya jaano Akshay babu.” “అక్షయ్ బాబూ, ముద్దు విలువ గురించి నీకేం తెలుసు?” అంటూ ఆసక్తికరంగా పెట్టింది. అక్షయ్, గుడ్డి మారుతి కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి . వీరిద్దరూ కలిసి “ఖిలాడీ,” “సైనిక్” వంటి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల్లో నటించారు. అక్షయ్ కుమార్ తో గడిపిన జ్ఞాపకాలను తను గుర్తు చేసుకుంది. గతేడాది సిద్ధార్థ్ కన్నన్‌తో చేసిన ఇంటర్వ్యూలో గుడ్డి మారుతి, అక్షయ్ కుమార్ మహిళల్లో ఉన్న అపారమైన క్రేజ్‌ను గుర్తుచేశారు. “ అతనికి చాలా గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. నేను వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరు ముగ్గురిలో ” ఒకదాన్ని అంటూ ఆమె నవ్వుతూ చెప్పిన విషయం గుర్తు చేశారు. అక్షయ్ ఒకే సమయంలో అనేక మందితో డేట్ చేయలేదని, కానీ ‘హార్ట్‌బ్రేకర్’‌గా మాత్రం పేరు పొందాడని గుడ్డి స్పష్టం చేశారు.

Also Read: Jubilee Hills By poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో హస్తంలో పెరిగిన కాన్ఫిడెన్స్.. కాంగ్రెస్ వ్యూహాలకు చిత్తవుతున్న బీఆర్ఎస్

బాలనటి నుంచి కామెడీ ఐకాన్‌వరకు గుడ్డి మారుతి ప్రయాణం

10 ఏళ్ల వయసులోనే నటన ప్రారంభి గుడ్డి మారుతి, “శోలా ఔర్ శబ్నమ్,” “ఆషిక్ ఆవారా,” “దుల్హే రాజా,” “బివీ నం.1” వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అంతే కాదు, టెలివిజన్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, “దోలి అర్మానో కీ” సిరీస్‌లో ‘బువా’ పాత్రతో ప్రత్యేక గుర్తింపును పొందింది.

Also Read: Bigg Boss Telugu 9: హౌస్‌లోకి ఊహించని గెస్ట్.. ప్రజా తిరుగుబాటు మొదలైంది.. ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!

Just In

01

KTR on Jubilee Hills Result: జూబ్లీహిల్స్ ఫలితంపై కేటీఆర్ తొలి స్పందన ఇదే

Tata Sierra 2025: మళ్లీ రాబోతున్న టాటా సియెర్రా 2025.. ఫీచర్లు ఇవే!

MLA Gandra Satyanarayana Rao: తరుగు పేరుతో రైతులను వేధిస్తే చర్యలు: ఎమ్మెల్యే సత్యనారాయణ రావు

Telusukada OTT: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Currency Scam: ఓరి నాయనా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టి దందా.. ఎంచేశారంటే..?