TGSRTC (imagecredit:twitter)
తెలంగాణ

TGSRTC: నష్టాల్లో ఉన్న ఆర్టీసీ డిపోల్లో ప్రత్యేక కమిటీలు: మంత్రి పొన్నం ప్రభాకర్

TGSRTC: ప్రభుత్వం నుంచి నెల వారీగా వస్తున్న మహాలక్ష్మి టికెట్(Mahalakshmi Ticket) ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ(RTC)లో ఇప్పటి వరకు మహిళలాలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకోగా రూ.7980 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందన్నారు. టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై దృష్టి సారించాలని అధికారులను దిశా నిర్దేశం చేశారు. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో, టీమ్ మిషన్ ల ద్వారా వచ్చే టికెట్ పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని సూచించారు. నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు ,వికారాబాద్ , బీహెచ్ఈఎల్ , మియాపూర్ , కుషాయిగూడ , దిల్ సుఖ్ నగర్ , హకీంపేట్ , రాణిగంజ్ , మిథాని తో పలు పలు డిపో లు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డినీ ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారీగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు

నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీల ప్రజలకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి డిమాండ్ కు అనుగుణంగా కొత్త రూట్ లలో బస్సులు నడిపించేలా స్థానిక డీఎం ఇతర ఆర్టీసీ అధికారులతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఒక నివేదిక ను రూపొందించి బస్సులు నడిపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 578 బస్సులు కొత్తగా రాష్ట్రంలో రోడ్డెక్కాయని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ లో 1000 ఆర్టీసీ డ్రైవర్లు ,743 శ్రామిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్వ్యూ దశలో ఉండడంతో నియామకాలు వేగంగా పారదర్శకంగా జరిగేలా పూర్తి చేయాలన్నారు. వచ్చే డిసెంబర్ చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ,114 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుందన్నారు. కారుణ్య నియామకాల కింద చేరిన ఆర్టీసీ కండక్టర్లకు ఉన్న మూడేళ్ల ప్రొవిజన్ రెండేళ్లకు తగ్గించేలా పరిశీలించాలని సూచించారు. మేడారం జాతర సమీపిస్తుండటంతో ములుగు బస్ స్టేషన్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం , పెద్దపల్లి జిల్లా బస్సు డిపో పనుల పురోగతి పై అడిగి తెలుసుకున్నారు. 

Also Read: Al Falah University: దిల్లీ పేలుడు ఎఫెక్ట్.. చిక్కుల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ.. కేంద్రం కీలక ఆదేశాలు

ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్..

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా కొత్త డిపో లకు అవసరమైన స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలన్నారు. నగరంలో నలువైపుల బస్ స్టేషన్ లు ఉండేలా జేబీఎస్ మాదిరి ఆరంఘర్ లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మించడానికి ఆర్టీసీ ,పోలీస్ శాఖ కి సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ లో ప్రమాదాలను తగ్గించడానికి తొలి దశలో లహరి , రాజధాని , గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం ను పని తీరును అడిగి తెలుసుకున్నారు . డ్రైవర్లకు నిరంతరం మెడికల్ టెస్ట్ నిర్వహించాలని సూచించారు. ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్లకు నిరంతర శిక్షణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులతో జూమ్ సమావేశం నిర్వహిస్తానని వెల్లడించారు. తార్నాక హాస్పిటల్ లో రోగుల బంధువుల కోసం ఏర్పాటు చేస్తున్న డార్మిటరీ రూం ను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Also Read: CM Chandrababu: ఏపీకి గుడ్ న్యూస్.. రెండ్రోజుల్లో విశాఖకు గూగుల్.. వెల్లడించిన సీఎం చంద్రబాబు

Just In

01

Tata Sierra 2025: మళ్లీ రాబోతున్న టాటా సియెర్రా 2025.. ఫీచర్లు ఇవే!

MLA Gandra Satyanarayana Rao: తరుగు పేరుతో రైతులను వేధిస్తే చర్యలు: ఎమ్మెల్యే సత్యనారాయణ రావు

Telusukada OTT: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Currency Scam: ఓరి నాయనా.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టి దందా.. ఎంచేశారంటే..?

Jogulamba Gadwal: జోరుగా అక్రమ ఇసుక రవాణా.. అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు