Revolver Rita Trailer: కీర్తి సురేష్ (Keerthy Suresh) ఈ మధ్యకాలంలో అస్సలు కలిసి రాలేదనే చెప్పుకోవాలి. సౌత్ వదిలి బాలీవుడ్‌కు వెళ్లిన కీర్తికి అక్కడా ఎదురు దెబ్బే తగిలింది. ఇక ఆమె ఆశలన్నీ ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita) పైనే ఉన్నాయి. రివాల్వర్ రీటానా? ఆమె ఎవరు? అనుకుంటారేమో.. ఇది కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం. నెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు రాబోయే చిత్రమిదే. వాస్తవానికి ఎప్పుడో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఎట్టకేలకు ఈ నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా గురువారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. కూల్‌గా, కామ్‌గా ఉంటూ.. రివాల్వర్ పట్టగానే దుమ్మురేపే పాత్రలో కీర్తి సురేష్ నటించినట్లుగా అర్థమవుతోంది. ట్రైలర్ (Revolver Rita Trailer)ను గమనిస్తే..
Also Read- Manchu Lakshmi: నాన్నకు, నాకు మధ్య గొడవలకి కారణం విష్ణు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
డ్రాకులా పాండియన్‌పైనే స్టోరీ..
ఈ వీధిలో ఒక ఇంట్లో బిజినెస్ చేస్తున్నారంట.. అది ఏ ఇళ్లో తెలుసా? అనే డైలాగ్‌లో ట్రైలర్ మొదలైంది. అదేం బిజినెస్ అని అక్కడ లోకల్ వారు అడుగుతున్నారు. ఈ గ్యాప్‌లో ఓ పెద్దాయనని చూపించి, అతన్ని గన్‌తో పేల్చి చంపేసినట్లుగా చూపించారు. ‘నాన్న నిన్న రాత్రి నుంచి మిస్సింగ్. ఎవడో నాన్నకు స్కెచ్ వేశాడు’ అని కరుడుగట్టిన విలన్ పాత్రలో సునీల్ చెబుతున్నారు. ఆ పెద్దాయన ఎవరో పోలీస్ ఆఫీసర్ చెబుతున్నారు. పాండిచ్చేరిలో డ్రాకులా పాండియన్‌కు స్కెచ్ వేసేంత దమ్ము ఎవరికి ఉంది బాబి? అని సునీల్‌కు సమాధానమిస్తున్నాడు పోలీస్ ఆఫీసర్. ఆ వెంటనే అది చేసింది కీర్తి అనేలా, ఆమె ఫేస్‌ను రివీల్ చేశారు. కస్టమర్ పేరేంటి? అని రౌడీలను పోలీసులు అడుగుతుంటే.. ఆమె పేరు రీటా సార్ అని సమాధానం చెబుతున్నారు. అంటే కీర్తి పాత్ర చాలా టిపికల్‌గా ఇందులో ఉంటుందనేది అర్థమవుతోంది.
ఫ్యామిలీ ఫ్యామిలీ
ఎక్కడరా మానాన్న? అని సునీల్ అడుగుతుంటే.. ‘నీమయ్మ కుమార్’ (వాడి పేరే అది) చెప్పే సమాధనం పెద్ద బూతుగా అనిపిస్తుంది. ఇక చనిపోయిన పాండియన్‌పై డాన్స్ మాట్లాడుకుంటున్నారు. కట్ చేస్తే, పాండియన్ డెడ్ బాడీ కీర్తి వాళ్ల ఇంటిలో ఉంటుంది. ఇక అక్కడి నుంచే అసలైన డ్రామా మొదలైంది. ఆ బాడీ కోసం సునీల్ అండ్ గ్యాంగ్ వెతుకుతూ ఉంటారు. ఇంట్లో రాధిక మాలలో ఉండటం, డెడ్ బాడీ ఉండటం, కీర్తి భయపడుతున్నట్లుగా యాక్ట్ చేస్తుండటం ఇవన్నీ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఒకవైపు పాండియన్ కోసం బాబీ.. దొరికినవాళ్లను దొరికినట్లు చంపేస్తూ ఉంటాడు. మరోవైపు ఇప్పుడే చేయాలో అర్థంకాక రాధిక అండ్ టీమ్ తలలు పట్టుకుంటూ ఉంటారు. ఇక మొదలవుతుంది ‘ఫ్యామిలీ ఫ్యామిలీ గోల’. ఫైనల్‌గా అసలు ఏం జరిగింది? కీర్తి ఏం చేస్తుంది. కస్టమరా? ఫ్యామిలీ గాళా? పోలీసా? లేక డానా? అసలెవరు ఈ రివాల్వర్ రీటా? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అనేలా.. ట్రైలర్‌ని కట్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. జెకె చంద్రు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టెక్నికల్ గానూ హై స్టాండర్డ్స్‌లో ఉంది. చూస్తుంటే.. ఈసారి కీర్తి హిట్ కొట్టేలానే కనిపిస్తుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
