Koragajja: రూటెడ్ కథలు.. అందునా కన్నడ నుంచి వస్తున్న వాటికి బాక్సాఫీస్ ఎలా షేకవుతుందో ‘కాంతార’ (Kantara) తెలియజేసింది. భూతకోళ అంటూ వచ్చిన ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇప్పుడలాంటి కథల కోసం మేకర్స్ బాగా సెర్చ్ చేస్తున్నారు. ఆ కోవలోనే.. కర్ణాటక, కేరళ, ముంబైలోని కొన్ని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా తులునాడులో పూజించబడే దైవం కొరగజ్జ కథతో.. కన్నడ నుంచి మరో రూటెడ్ చిత్రం రాబోతోంది. ‘కొరగజ్జ’ (Koragajja) అనే టైటిల్‌తో రానున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ సినిమాస్ బ్యానర్‌పై త్రివిక్రమ్ సాపల్య (Thrivikram Sapalya) నిర్మిస్తుండగా, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సుధీర్ అత్తవర్ (Sudheer Attavar) తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, విశేష ఆదరణను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను మంగళూరులో ఘనంగా నిర్వహించారు.
Also Read- Manchu Lakshmi: నాన్నకు, నాకు మధ్య గొడవలకి కారణం విష్ణు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
అందరినీ సర్‌ప్రైజ్ చేసేలా..
ఈ కార్యక్రమంలో.. సినిమాలో నటిస్తున్న పాత్రధారులందరూ విభిన్న గెటప్స్‌లో కనిపించడం, ‘కొరగజ్జ’ థీమ్‌లో అందరూ ఈ వేడుకలో సందడి చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రంలోని పాటల్ని షారోన్ ప్రభాకర్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, శంకర్ మహదేవన్, జావేద్ అలీ, అర్మాన్ మాలిక్, స్వరూప్ ఖాన్, అనిలా రాజీవ్, సుధీర్ అత్తవర్ వంటి స్టార్ సింగర్స్ ఆలపించారు. జీ మ్యూజిక్ ద్వారా ఈ చిత్ర ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. ఈ మేరకు నిర్వహించిన ఆడియో వేడుకలో నిర్మాత త్రివిక్రమ్ సాపల్య మాట్లాడుతూ.. మా ఈ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మేం రిలీజ్ చేసిన పోస్టర్, 3డీ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నాం. అందరినీ సర్‌ప్రైజ్ చేసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పగలనని అన్నారు.
పోస్ట్ ప్రొడక్షన్‌లో..
దర్శకుడు సుధీర్ అత్తవర్ మాట్లాడుతూ.. కన్నడ చిత్ర పరిశ్రమలో 30 ఏళ్ల క్రితమే పాన్ వరల్డ్ సినిమాలు వచ్చాయి. ‘నాగరహోలి’ అనే సినిమా ప్రపంచ వ్యాప్తంగా 13 భాషల్లో విడుదలై రికార్డు సృష్టించింది. కన్నడలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. అందులో ఈ మధ్యకాలంలో వచ్చిన ‘కాంతార’ కూడా ఒకటి. కన్నడ నుంచి వచ్చిన కల్పన గారు మనకు రష్యాలో అంబాసిడర్‌గా ఉండేవారు. మాకు ఎక్కువగా గ్రామపీఠ అవార్డులు వచ్చాయి. ఇక ఇప్పుడు మా నుంచి ‘కొరగజ్జ’ అనే రూటెడ్ కథతో చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను చూసి ఆదరించండి. సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమా ‘కాంతార’ ఫీల్‌ని, థ్రిల్‌ని ఇస్తుందని అన్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటీనటులు శృతి, భవ్య, సందీప్ సొపర్‌కర్ వంటి వారు ప్రసంగించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
